📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News: Penalty: మోహన్‌బాబు విశ్వవిద్యాలయానికి భారీ జరిమానా

Author Icon By Vanipushpa
Updated: October 8, 2025 • 2:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నటుడు మంచు మోహన్‌బాబుకు బిగ్‌ షాక్‌ తగిలింది.తిరుపతిలో ఉన్న ఆయన యూనివర్సిటీ మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ భారీ జరిమానా విధించింది. గత మూడేళ్ల నుంచి విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ఫీజుల రూపేణా రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మోహన్ బాబు(Mohan Babu) యూనివర్సిటీపై ఉన్నత విద్యా కమిషన్‌ విచారణ జరిపింది. విచారణలో అధిక ఫీజు వసూలు నిజమేనని నిర్ధారణ అయింది. దీంతో యూనివర్సిటీకి రూ.15 లక్షల జరిమానా విధించింది. అలాగే విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26 కోట్లను 15 రోజుల్లో తిరిగి వారికి చెల్లించాలని ఆదేశించింది. కాగా జరిమానా విధించిన రూ.15 లక్షల మొత్తాన్ని మోహన్ బాబు(Mohan Babu) యూనివర్సిటీ చెల్లించింది. అంతేకాక అవకతవకలకు పాల్పడిన యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని కూడా ఉన్నత విద్యా కమిషన్‌ ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశ

Penalty: మోహన్‌బాబు విశ్వవిద్యాలయానికి భారీ జరిమానా

యూనివర్సిటీ లో పలు అవకతవకలు

కాగా గత కొంతకాలంగా మోహన్‌బాబు కాలేజీపై అనేక ఆరోపణలు వస్తున్నాయి.విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం, యూనివర్సిటీ ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలకు పాల్పడటం, ఒరిజినల్‌ సర్టిఫికెట్లను వారికి ఇవ్వకుండా నిలిపివేయడంపై ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ విచారణ జరిపింది. ఆరోపణలన్నీ నిజమేనని తేలడంతో మోహన్‌బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయానికి రూ.15 లక్షల జరిమానా విధించింది. 2022-23 నుంచి గతేడాది సెప్టెంబరు 30 వరకు విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26,17,52,872 మొత్తాన్ని తిరిగి చెల్లించాలని గత నెల 17న కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన వివరాలను కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచింది. అలాగే మోహన్‌ బాబు విశ్వవిద్యాలయం అనుమతి, గుర్తింపును ఉపసంహరించాలని ప్రభుత్వానికి, యూజీసీ, ఏఐసీటీఈ, పీసీఐ, ఐసీఆర్, ఎన్‌సీఏహెచ్‌పీ, హెల్త్‌ కేర్‌ ప్రొఫెషన్స్‌ కౌన్సెల్‌కు తదితర సంస్థలకు సిఫార్సు చేయడం గమనార్హం.

అదనంగా ఫీజులు వసూలు

తిరుపతి జిల్లాలో రంగంపేటలో మోహన్ బాబు శ్రీవిద్యానికేతన్‌ పేరుతో ఏర్పాటు చేసిన కాలేజీ 2022లో మోహన్‌బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయంగా మారింది. దానిప్రకారం అప్పటి వరకు శ్రీవిద్యానికేతన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఉన్న సీట్లలో 70%, ఆ తర్వాత ప్రైవేటు విశ్వవిద్యాలయంలో గ్రీన్‌ఫీల్డ్‌ కింద ప్రారంభించే కోర్సుల్లోని 35% సీట్లను ప్రభుత్వం కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తుంది. దీనికి సంబంధించి ఉన్నత విద్య నియంత్రణ కమిషన్‌ ఫీజులను నిర్ణయిస్తుంది. కన్వీనర్‌ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి కమిషన్‌ ఎంతయితే ఫీజులను నిర్ణయించిందో అంతే వసూలు చేయాలి. అయితే విశ్వవిద్యాలయం మాత్రం అదనంగా ఫీజులు వసూలు చేస్తుందని తల్లిదండ్రుల అసోసియేషన్‌ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌తో పాటు విద్యాశాఖ మంత్రి తదితరుకు ఫిర్యాదు చేసింది. బిల్డింగ్, ట్యూషన్‌ ఫీజు, ఇతర ఫీజులతో పాటు హాస్టల్‌లో ఉండని వారి నుంచి కూడా మెస్‌ ఛార్జీలు వసూలు చేస్తోందని వారు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల మేరకు కమిషన్‌ ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది.

ఏఐసీటీఈకి పలు ఫిర్యాదులు

మరోవైపు మోహన్ బాబు యూనివర్సిటీపై అనేక ఆరోపణలు వచ్చాయి. విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఏఐసీటీఈకి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. విద్యార్థి సంఘాలు కూడా మీడియా సమావేశాలు నిర్వహించాయి. మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవలు జరిగిన సమయంలో మంచు మనోజ్ కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతుగా ఉంటానని ప్రకటించడం అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే.

మోహన్ బాబుకు ఎంతమంది భార్యలు?
వ్యక్తిగత జీవితం. మోహన్ బాబు విద్యా దేవిని వివాహం చేసుకున్నాడు, ఆమెకు మంచు లక్ష్మీ ప్రసన్న అనే కుమార్తె, మంచు విష్ణు అనే కుమారుడు ఉన్నారు, వీరిద్దరూ సినిమా పరిశ్రమలో నటులు. ఆమె మరణం తరువాత, అతను ఆమె చెల్లెలు నిర్మలా దేవిని వివాహం చేసుకున్నాడు, ఆమెకు నటుడు మంచు మనోజ్ అనే కుమారుడు ఉన్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

educational institutions higher education Legal Issues Mohan Babu University Private Universities regulatory violations Telugu News university fine university penalty

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.