kidnapp Case- Mohan Babu: టాలీవుడ్ సీనియర్ సినీనటుడు మోహన్‌బాబు కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కిడ్నాప్ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ చేపట్టారు. కిడ్నాప్ ఘటనకు ముందు, ఆ తర్వాత కూడా కేసులో ప్రధాన నిందితుడైన యూనివర్సిటీ పీఆర్‌వో సతీశ్‌తో మోహన్‌బాబు ఫోన్‌లో మాట్లాడారని, మెసేజ్‌లు కూడా పంపుకున్నారని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కాల్స్, మెసేజ్‌లకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇంకా రావాల్సి ఉందని పేర్కొన్నారు.
Read Also: Manchu Lakshmi: సినిమా నిర్మాణానికి మంచు లక్ష్మి గుడ్‌బై
విచారణ మార్చి 3వ తేదీకి వాయిదా
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, ఫోరెన్సిక్ నివేదిక రానున్న నేపథ్యంలో ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేశారు. కేసులో లోతైన విచారణ జరపాల్సి ఉందని పేర్కొంటూ, ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని మోహన్‌బాబు దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌పై విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేశారు.మోహన్‌బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ నిరసన తెలిపేందుకు వెళ్తున్న విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై తిరుచానూరు పోలీసులు ఫిబ్రవరి 3న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మోహన్‌బాబును ఏ-2గా చేర్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: