हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Modi: నేడు సిఎం, రేపు ప్రధాని సత్యసాయి జయంతి వేడుకలకు రాక

Rajitha
News Telugu: Modi: నేడు సిఎం, రేపు ప్రధాని సత్యసాయి జయంతి వేడుకలకు రాక

అనంతపురం: శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో భగవాన్ శ్రీసత్యసాయిబాబా (sathya sai baba) 100వ జయంతి వేడుకల్లో భాగంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర అతిరథ మహా రథులు ఎందరో పాల్గొననున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ పుట్టపర్తికి వస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 19వ తేదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీభగవాన్ సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకల్లో భాగంగా పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. సత్యసాయి సెంట్రల్స్ట్ ఆధ్వర్యంలో ప్రతియేటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. అయితే శ్రీభగవాన్ సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకలను ప్రభుత్వ పరంగా నిర్వహించడం ఒక ఎత్తైతే, జయంతి ఉత్సవాలకు ప్రధాని నరేంద్రమోదీ – ముఖ్య అతిథిగా హాజరవుతుండటం చర్చనీయాంశంగా మారింది.

Read also: AP Weather: అల్పపీడనం.. ఇవాళ భారీ వర్షాలు

CM today, PM tomorrow to attend Sathya Sai Jayanti celebrations

CM today, PM tomorrow to attend Sathya Sai Jayanti celebrations

మోదీ చేతులు మీదుగా పలు పథకాలను

Modi: ఈ నెల 19వ తేదిన ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి ఎయిర్ పోర్టుకు చేరుకుని పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి బాబా సమాధిని సందర్శిస్తారు. తదనంతరం పుట్టపర్తిలోని హిల్ వ్యూస్టేడియంకు చేరుకుని శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు, భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేతులు మీదుగా పలు పథకాలను ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలియ వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మహిళా విద్యార్థినీలకు ఉపయోగపడే విధంగా ఒక స్కీంను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా కొంత మంది రైతులను ఎంపిక చేసి పాడి ఆవులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తరుపున శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకలను ప్రతిష్టగా తీసుకుని నాణ్యాలు, స్టాంపులు ఆవిష్కరించే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ చేతులు మీదుగా ఏం కార్యక్రమాలు చేపడతారు, ఏ పథకాలు ఆవిష్కరిస్తారన్నది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఈ నెల 18వ తేదిన

Modi: ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు పర్యటనలకు సంబంధించి కూడా అధికారికంగా పర్యటన వివరాలను ప్రకటించాల్సి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18వ తేదిన (మంగళవారం) సాయంత్రం పుట్టపర్తికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. బుధవారం ఉదయం పుట్టపర్తి ఎయిర్ పోర్టులో ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలకనున్నారు విఐపిల అధికారుల పర్యటన వివరాలను గుట్టుగా ఉంచడం గమనించ దగ్గ విషయం. ఇదిలా ఉండగా శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకల్లో భాగంగా పుట్టపర్తి విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. జిల్లా మంత్రులు సత్యకుమార్ యాదవ్, సవితమ్మ, పయ్యావుల కేశవ్, ఎంపిలు బికె. పార్థసారధి, అంబికా లక్ష్మినారాయణ తదితరులు సత్యసాయి బాబా జయంతి వేడుకలు విజయవంతానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 23వ తేదిన భగవాన్ సత్యసాయిబాబా జయంతి ఉంది. ఆరోజు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇతర ముఖ్యులు పాల్గొనే అవకాశం ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోమవారం అధికారులు, ప్రజా ప్రతినిధులతో పుట్టపర్తిలో సత్యసాయి జయంతి వేడుకలపై సమీక్ష నిర్వహించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870