బాపట్ల జిల్లా చీరాల మండలంలో శ్రీ స్వామి వివేకానంద అసోసియేషన్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాల కొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్‌ను (calender) విడుదల చేశారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడగా, స్థానికులు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Read also: Seed Act: పటిష్టమైన విత్తన చట్టమే పరిష్కారం
New Year calendar was unveiled in Chirala
ప్రజాసేవలకు ఎమ్మెల్యే కొండయ్య ప్రశంసలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ, స్వామి వివేకానంద అసోసియేషన్ ఆఫ్ ఫ్రెండ్స్ సంస్థ సమాజ హితార్థంగా చేపడుతున్న సేవలను ప్రశంసించారు. యువతను సేవా భావన వైపు నడిపించే కార్యక్రమాలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కూటమి నాయకులు, టీడీపీ, బీజేపీకి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. సమాజంలో ఐక్యత, సేవాభావం పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని వక్తలు అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: