📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Mithun Reddy: మిథున్ రెడ్డి అరెస్ట్‌పై పెద్దిరెడ్డి ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: July 20, 2025 • 4:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన విషయం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్. లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని శనివారం సిట్ అధికారులు అరెస్ట్ చేయడం, ఆదివారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరచడం చర్చనీయాంశంగా మారింది. ఈ అరెస్ట్‌పై మిథున్ రెడ్డి తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) తీవ్రస్థాయిలో స్పందించారు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, “మిథున్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఎలాంటి నేరపు ఆధారాలు లేకపోయినా, సిట్ విచారణ పేరుతో అరెస్ట్ చేయడం దుర్మార్గం. గతంలోనూ ఎయిర్‌పోర్టు మేనేజర్‌పై దాడి చేశాడని తప్పుడు కేసు పెట్టారు. ఆ కేసు కూడా నిలబడలేదు. ఇప్పుడు ఇదే తరహాలో లిక్కర్ కేసులో ఇరికించడానికి కుట్ర పన్నారు,” అని ఆరోపించారు.మేనేజర్‌ను అడ్డుపెట్టుకుని అప్పట్లో కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని,ఆ కేసు నిలబడలేదన్న పెద్దిరెడ్డి.

మదనపల్లి ఫైల్స్ ఎఫెక్ట్ లేదు

ఇప్పుడు కూడా ఈ లిక్కర్ కేసు నిలబడదని ధీమా వ్యక్తం చేశారు.ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం కక్షసాధిస్తోందని, ఏదో ఒకరకంగా తమను ఇబ్బందులు పెట్టాలని చూస్తోందని పెద్దిరెడ్డి ఆరోపించారు. మదనపల్లి ఫైల్స్ అంటూ ఏమేమో చేశారని, అందులో తమపై ఏమీ లేదని తేలిపోయిందన్నారు. మిథున్ రెడ్డి (Mithun Reddy) మూడుసార్లు ఎంపీగా గెలిచారన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉంటాడనే తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఈ కేసు కూడా తప్పుడు కేసు అని తేలుతుందని, చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇదో మచ్చలాగా మిగులుతుందని అన్నారు.తమ కుటుంబం మీద ఉన్న విద్వేషం, కక్ష కారణంగానే తప్పుడు కేసులు పెడుతున్నారన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తాము ఏ తప్పూ చేయలేదని, కడిగిన ముత్యంగా మిథున్ రెడ్డి బయటకు వస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు.

Mithun Reddy: మిథున్ రెడ్డి అరెస్ట్‌పై పెద్దిరెడ్డి ఏమన్నారంటే?

కడిగిన ముత్యంగా

కూటమి ప్రభుత్వం దుర్మార్గాలకు ప్రజలు సరైన సమాధానం చెప్తారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఏపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 143 హామీలు, ఆరు సూపర్ సిక్స్ హామీ (Super six guaranteed) లు నెరవేర్చలేదన్న పెద్దిరెడ్డి, ప్రజలు, మహిళలు, నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం మీద నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు విపక్ష నేతలను అరెస్ట్ చేయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపోయారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఏ రాష్ట్రాలలో కేవలం 40 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు?

మిజోరాం (Mizoram) మరియు గోవా (Goa) రాష్ట్రాలలో ప్రస్తుతానికి కేవలం 40 మంది మాత్రమే శాసనసభ్యులు (MLAs) ఉంటారు. ఇవి చిన్న రాష్ట్రాలు కావడంతో సభ్యుల సంఖ్య తక్కువగా ఉంటుంది.

మిథున్ రెడ్డి ఎన్నిసార్లు ఎంపీగా గెలిచారు?

మిథున్ రెడ్డి ఇప్పటివరకు మూడుసార్లు ఎంపీగా గెలిచారు. మొదటిసారి 2014లో, తర్వాత 2019లో, మూడోసారి 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Ambati Rambabu: వైఎస్సార్‌సీపీ సీనియ‌ర్ నేత అంబటి రాంబాబుకు పోలీసులు నోటీసులు జారీ

AP Politics AP SIT Liquor Case Breaking News Chandrababu Government latest news PeddiReddy Mithun Reddy Political Revenge Revanth Reddy Telugu News ysrcp leaders YSRCP MP Arrest

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.