డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (pawan kalyan) చేసిన భూకబ్జా ఆరోపణలపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించారన్న పవన్ ఆరోపణలను ఆయన ఖండిస్తూ, ఆ భూమి తమ చట్టబద్ధమైన సొత్తు అని స్పష్టం చేశారు. పవన్ చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. “మా కుటుంబం ఆ భూమిని 2000 సంవత్సరంలోనే చట్టబద్ధంగా కొనుగోలు చేసింది. హెలికాప్టర్‌లో చూపించిన భూమి మా సొంతం” అని మిథున్ రెడ్డి తెలిపారు.
Mithun Reddy: పవన్ ఆరోపణలపై స్పందించిన ఎంపీ మిథున్ రెడ్డి
Read also: Nara Lokesh: విశాఖలో పలు ప్రొజెక్టులకు నారా లోకేష్ శంకుస్థాపన
మంగళం పేట ప్రాంతాన్ని
పవన్ కళ్యాణ్ హెలికాప్టర్‌లో తూర్పు కనుమల పరిధిలోని మంగళం పేట ప్రాంతాన్ని పరిశీలించి, పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములను ఆక్రమించిందని ఆరోపించారు. ఆయన ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మిథున్ రెడ్డి ఇచ్చిన కౌంటర్‌తో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఈ వివాదంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో ఆసక్తిగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: