📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest Telugu News: Earthquake: తెలుగు రాష్ట్రాలలో స్వల్ప భూ ప్రకంపనలు

Author Icon By Vanipushpa
Updated: October 18, 2025 • 1:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల తెలుగు రాష్ట్రాలలో(Andhra Pradesh) (Telangana) స్వల్ప భూ ప్రకంపనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. గతంలో తెలంగాణలోని ములుగు ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం(Earthquake) సంభవించింది. దీని ప్రభావం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి వంటి ప్రాంతాలలో కూడా కనిపించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. జపాన్ దేశం నోటో ద్వీపకల్పంలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. అలాగే, ఆఫ్ఘనిస్తాన్ కూడా గతంలో వరుస భూకంపాల ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం, ఇళ్లు ధ్వంసం కావడం వంటి విషాదాలను చూసింది. తాజాగా భారత్ లో కూడా స్వల్వ భూకంపం సంభవించింది.

Read Also: TG: భారీగా ప్రభుత్వ వైద్య  పీజీ సీట్లు పెంపు

Earthquake: తెలుగు రాష్ట్రాలలో స్వల్ప భూ ప్రకంపనలు

అస్సాంలోని స్వల్ప భూకంపం

అస్సాంలోని కచార్ జిల్లాలో ఈరోజు ఉదయం రిక్టర్ స్కేలుపై 2.7 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఈ భూకంపం శనివారం ఉదయం సంభవించింది. కచార్ జిల్లాలో భూమి కంపించడంతో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. ఈ భూకంప కేంద్రం, లోతుపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

భయాందోళనలకు గురికావొద్దని స్థానిక అధికారులు విజ్ఞప్తి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయాందోళనలకు గురికావొద్దని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు. అయితే ఎలాంటి ప్రమాదాలు లేనప్పటికీ, ప్రజలు ఇలాంటి సమయంలో భూకంపాల నుండి రక్షణ కోసం కొన్ని సూచనలు పాటించాలని అధికారులు తెలిపారు. భూమి కంపించినప్పుడు వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు (భవనాల నుండి దూరంగా ఉన్న బహిరంగ ప్రదేశాలు) వెళ్లడం, లేదా పటిష్టమైన వస్తువుల కింద ఆశ్రయం పొందడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

earthquake in South India minor tremors Andhra Pradesh Telangana seismic activity Telugu states Telugu News Telugu states earthquake

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.