📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Minister Shivaraj Singh: ఏపీకి వచ్చినప్పుడు తెలుగు నేర్చుకుంటా: మంత్రి

Author Icon By Anusha
Updated: November 12, 2025 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రజలతో దగ్గరగా మమేకమై, వారి హృదయాలను గెలుచుకున్న నాయకులు దేశ రాజకీయ చరిత్రలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Minister Shivraj Singh) ఒకరు.

Read Also: Vijayawada: గోదావరి పుష్కరాలు-2027 కార్యదర్శుల బృందం

గుంటూరులో రెండు రోజుల పాటు జరిగిన వాటర్‌షెడ్‌ మహోత్సవ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన శివరాజ్ సింగ్ (Minister Shivraj Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో అందరూ ఆప్యాయంగా తనను మామ అని పిలుచుకుంటారని.. ఇక నుంచి తాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మామనే అని చెప్పారు.

ఏపీలో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లది సరైన కాంబినేషన్ అన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హిందీలో మాట్లాడటం తనను ఆలోచింపజేసిందన్న శివరాజ్ సింగ్.. మళ్లీ ఏపీ వచ్చినప్పుడు తెలుగు నేర్చుకుని వస్తాన్నారు. ఆంధ్రప్రదేశ్ (AP) అక్షర క్రమంలోనే కాదు.. అభివృద్ధిలోనూ ముందుండాలని శివరాజ్ సింగ్ ఆకాంక్షించారు.మనులకు మంచినీరే జీవితం అని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.

 Minister Shivaraj Singh

పలు అభివృద్ధి పనులకు.. వర్చువల్‌ విధానంలో

మట్టి లేకపోతే రైతులకు ఆధారం లేదని చెప్పారు. ఈ రెండింటినీ కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరం కృషి చేయాలని.. మట్టికి జీవం పోసి, మంచినీటిని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఆలోచనతో చేపట్టిన వాటర్‌షెడ్‌ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళదాం అన్నారు. గుంటూరు జిల్లాలోని 150 ఏళ్ల వెంగళాయపాలెం చెరువు అభివృద్ధి చేసిన తీరు దేశానికే ఆదర్శం అని చెప్పారు.వెంగళాయపాలెం చెరువు స్ఫూర్తితో దేశంలోని అనేక చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నట్లు శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.

చెరువుల అభివృద్ధితో పాటు చెక్‌డ్యామ్‌లు నిర్మించి.. రైతులకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక అనంతపురం జిల్లాలోని ఇప్పేరు, అన్నమయ్య జిల్లాలోని గుండ్లపల్లి, కుప్పం నియోజకవర్గంలోని కడపల్లిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు.. వర్చువల్‌ విధానంలో భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు శివరాజ్ సింగ్. అంతేకాకుండా వాటర్‌షెడ్‌ జన్‌భాగీదారీ కప్‌-2025 పోటీలో విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Guntur Watershed Mahotsav latest news Shivraj Singh Chouhan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.