అనంతపురము : విద్యతోనే బిసిలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి చేరుకోగలరని రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రి ఎస్. సవితమ్మ(Minister Savithamma) స్పష్టం చేశారు. అనంతపురంలో ఆదివారం నిర్వహించిన వడ్డే ఓబన్న రాష్ట్ర స్థాయి జయం త్యోత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎంపిలు, ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు, వడ్డెర సంఘ నాయకులతో కలిసి మంత్రి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. బ్రిటిష్ నిరంకుశ పాలనకు ఎదురొడ్డి ప్రజల హక్కుల కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు ఆదివారం అనంతపురంలోని లలిత కళా పరిషత్ వేదికగా ఘనంగా నిర్వహించారు.
Read also: AP: డిప్యూటీ సీఎం పవన్‌కు అభినందనలు తెలిపిన మంత్రి లోకేశ్
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి ఎస్. సవితమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే బ్రిటీషర్ల దాష్టీకాలకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన యోధుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. బిసిలకు గుర్తింపు ఇచ్చిన, అండగా నిలిచిన ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బిసిల సంక్షేమం కోసం మొదట సమావేశం నిర్వ హించారని, బిసిల పట్ల నిజమైన నిబద్ధత కలిగిన ప్రభుత్వం ఇదే అని అన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో వడ్డర్లకు ఇచ్చిన హామీ మేరకు వారికి మేలు చేయాలని నిబద్ధతతో వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా శాశ్వతంగా రాష్ట్ర వేడుకగా జరుపుకోవాలని జి.ఓ వచ్చేలా కృషి చేశారని, ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
విద్యావంతులుగా అయినపుడే పురోగతి ఉంటుందని తెలుపుతూ, మన రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందన్నారు. వడ్డర్లను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందని, బిసిలకు ఎంఎస్ఎమ్ఎ పార్కుల ఓబన్న రాయంతోత్సవము అనంతపురంలో జరిగిన వడ్డే ఓబన్న జయంతి(Vadde Obanna Jayanti) సభలో మంత్రి సవిత మాట్లాడుతూ కేటాయింపులో రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు. క్వారీలలో 15 శాతం వడ్డర్లకు రిజర్వేషన్ కల్పించడం హర్షించదగినదన్నారు. బిసి గురుకుల పాఠశాలల పునరుద్ధరణ పనులు చేపట్టాం, వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం అన్నారు. ఒకపక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ, ఒక పక్క రాష్ట్రానికి సంపద సృష్టిస్తూ పరిశ్రమలు తీసుకొస్తు మన బిడ్డలకు ఉపాధి చూపించడానికి ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం, క్యాబినెట్, ప్రజాప్రతినిధులు అందరూ కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి దశా దిశ మేరకు ఏదైతే జనాభా దామాషా ప్రకారం నిధులు విధులు కూడా కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నామని, అంతే కాకుండా బీసీల రక్షణ చట్టం కొరకు కూడా అడుగులు వేస్తున్నామని తెలిపారు.
బిసి కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ మల్లిఖార్జున, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఎంపి అంబికా లక్ష్మీ శ్రీ నారాయణ, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వర రావు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎమ్. ఎస్ రాజు, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పూల నాగరాజు, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు చైర్మన్, పలువురు వడ్డెర సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ తొలి నాటి స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి రైతుల పక్షాన పోరాడారని వారు ఆదర్శనీయులు అని పేర్కొన్నారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా పలువురు వడ్డర్లకు సన్మానం చేయగా, మంత్రిని పలువురు సముచితంగా సత్కరించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: