Minister Savitha: నేతన్నల ఇళ్ళల్లో వెలుగులు

Read Time:  1 min
Minister Savitha
Minister Savitha
FONT SIZE
GET APP

-బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత

Minister Savitha : గత ప్రభుత్వ హయాంలో సంక్షోభంలో కూరుకు పోయిన చేనేత రంగాన్ని గట్టేక్కించి, నేతన్నల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల్లో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, గత 5 ఏళ్ళ పాలనలో చేనేత రంగానికి జరిగిన అన్యాయాన్ని ఎండగట్టారు. చేనేత సహకార సంస్థ (ఆప్కో)ను గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని మంత్రి వివరించారు. “కేంద్రం నుంచి ఆప్కో అభివృద్ధి కోసం వచ్చిన రూ.120 కోట్లు ఏమయ్యాయో సమాధానం లేదు. ఆ నిధులను జగన్ అనే గద్ద ఎత్తుకెళ్ళి పోయింది” అంటూ ఘాటుగా విమర్శించారు. 2019–24మధ్య కాలంలో త్రిఫ్ట్ ఫండ్, పావలావడ్డీ, నూలు సబ్సిడీ వంటి కీలక పథకాలను నిలిపివేసి నేతన్నల పొట్టకొట్టారని మండిపడ్డారు.

Read Also:AP group 1 case : గ్రూప్-1 కేసులో కీలక మలుపు, సిట్ విచారణపై హైకోర్టు నిఘా

Minister Savitha
Minister Savitha: Lights in the houses of leaders


చేనేత సహకార సంఘాలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను తాము అధికారంలోకి రాగానే క్లియర్ చేస్తున్నామని, ఇప్పటికే రూ.7కోట్లు చెల్లించామని తెలిపారు. వచ్చే ఉగాది నాటికి మరో విడత బకాయి లను విడుదల చేస్తామని నేతన్నలకు తీపి కబురు అందించారు. 50 ఏళ్ళు నిండిన 93వేల మంది కార్మికులకు .4000 చొప్పున పెన్షన్ అందిస్తు న్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 1నుంచి అమ ల్లోకి వచ్చేలా మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గాల వారికి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తున్నా మన్నారు. నూలు కొనుగోలుపై 15 శాతం సబ్సిడీనీ పునరుద్దరించినట్లు తెలిపారు. ముద్ర పథకం ద్వారా 2640 మందికి రూ.24.43 కోట్ల రుణాలు అందించామని, 109 సంఘాలకు రూ.78.73 కోట్ల నగదు పరపతి కల్పించామని పేర్కొన్నారు. చిన్న క్లస్టర్ల అభివృద్ధి పధకం కింద 10 క్లస్టర్లను మంజూరు చేశామన్నారు. చేనేత వస్త్రాల అమ్మకాలను పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కార్మికుల నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణా కార్యక్రమా లతో పాటు, రాష్ట్రంలో భారీ ఎత్తున టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని సభకు వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.