Minister Savita: బీసీ స్కాలర్‌షిప్‌లకు రూ.90.50 కోట్లు మంజూరు

Read Time:  1 min
Minister Savita
Minister Savita
FONT SIZE
GET APP

AP Scholarships: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్షిప్ రెండో విడత నిధులుగా మొత్తం రూ.90.50 కోట్లను మంజూరు చేసినట్లు మంత్రి సవిత (Minister Savita) వెల్లడించారు.

Read also: AP: నకిలీ మద్యం కేసు.. నిందితులకు మూడు రోజులపాటు కస్టడీ

ఆర్థిక సమస్యల కారణంగా

ఇందులో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్‌కు రూ.69.40 కోట్లు, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్‌ (Pre Matric Scholarship)కు రూ.21.10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆర్థిక సమస్యల కారణంగా విద్యార్థులు చదువుకు దూరం కాకుండా చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు.

AP Scholarships
Minister Savita: Rs. 90.50 crore sanctioned for BC scholarships

మంత్రి సవిత మాట్లాడుతూ

మంత్రి సవిత మాట్లాడుతూ, స్కాలర్షిప్(Scholarship) నిధులు త్వరలోనే అర్హులైన విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయని తెలిపారు. బీసీ సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, విద్యతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమని ఆమె అన్నారు. భవిష్యత్తులో కూడా బీసీ విద్యార్థులకు మరింత మెరుగైన సదుపాయాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.