📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Minister Savita: ఏఐతో బిసి హాస్టళ్ల పర్యవేక్షణ

Author Icon By Anusha
Updated: July 24, 2025 • 12:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా బిసి హాస్టళ్ల పర్యవేక్షణ చేపట్టనున్నామని, త్వరలోనే దీనికి సంబంధించిన యాప్ రూపొందించనున్నామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత (S. Savita) తెలిపారు. ఏఐతో బిసి హాస్టళ్ల జవాబుదారీతనం మరింత పెరగనున్నట్లు వెల్లడించారు. వచ్చే నెల 30లోగా హాస్టళ్లకు మంజూరైన మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆదరణ 3.0ద్వారా కులవృత్తుదారులకు ఆధునిక పరికరాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. విజయవాడ నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం ఆయా జిల్లాల బిసి సంక్షేమ శాఖాధికారులు, డిబిన్ డబ్ల్యూఇఒలు, ఎబిసిడబ్ల్యూఇఒలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. ముందుగా బిసి హాస్టళ్లు, ఎంజెపి స్కూళ్ల నిర్వహణ తీరుతెన్నులను రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. సత్యనారాయణ వివరించారు.

అడ్మిషన్లు పూర్తి చేయాలని స్పష్టంచేశారు

అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, బిసి హాస్టళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అడ్మిషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే నెల అయిదో తేదీలోగా అడ్మిషన్లు పూర్తి చేయాలని స్పష్టంచేశారు. ముఖ ఆధారిత గుర్తింపు(ఫేషియల్ రికగ్నైషన్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ ఎస్ఆర్ఎస్) ద్వారా విద్యార్థుల హాజరులో ఆటంకాలు ఏర్పడితే, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి సమస్య పరిష్కారించుకోవాలన్నారు. వచ్చే నెల అయిదో తేదీలోగా నిర్దేశించిన లక్ష్యం మేర అడ్మిషన్లు పూర్తి చేయాలని మంత్రి సవిత స్పష్టంచేశారు. బిసి హాస్టళ్ల అభివృద్ధికి సిఎం చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) అధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి సవిత తెలిపారు.

Minister Savita: ఏఐతో బిసి హాస్టళ్ల పర్యవేక్షణ

ఇందుకు సంబంధించి

దీనిలో భాగంగానే గతం ప్రభుత్వం పెట్టిన డైట్ బిల్లుల బకాయిలు చెల్లించడమే కాకుండా, ఎప్పటికప్పుడు డైట్ బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. హాస్టళ్లలో రాత్రి సమయాల్లో హెచ్ డబ్ల్యూవోలు ఉండాలని స్పష్టంచేశారు. హాస్టళ్ల పనితీరు మరింత మెరుగుపడాలంటే నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు. మంత్రిగా తాను అన్ని జిల్లాల్లో ఉన్న బిసి హాస్టళ్లను, ఎంజేపీస్కూళ్లను ఎప్పకటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు వివరించారు. డిబిసిడబ్ల్యూఇఒలు, ఎబిసిడబ్ల్యూ ఇఒలు తరుచూ హాస్టళ్ల (Hostel) ను సందర్శించాలని, వీలైతే రాత్రి బస కూడా చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి టూర్ డైరీ రూపొందించాలని, ఆ డైరీని ప్రతి నెలా అయిదో తేదీలోగా రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని తెలిపారు. హెచ్ డబ్ల్యూఎస్ లు రాత్రి సమయాల్లో హాస్టళ్లలో తప్పనిసరిగా బస చేయాల్సిందేనని మంత్రి సవిత స్పష్టంచేశారు. విద్యార్థులను బాధ్యతతో సొంత బిడ్డల మాదిరిగా చూసుకోవాలన్నారు.

సవిత గారు ఎవరు?

Sanjeevareddygari Savitha గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ మహిళా నాయకురాలు. ఆమె ప్రస్తుతం పెనుకొండ ఎమ్మెల్యేగా (Penukonda MLA) పనిచేస్తున్నారు.

ఆమె ఏ పార్టీకి చెందినవారు?

ఆమె తెలుగు దేశం పార్టీ (TDP) కు చెందినవారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: CS Vijayanand: అమరావతిలోనే స్వాతంత్య్ర వేడుకలు

Adarana 3.0 AI Supervision Hostels Andhra Pradesh MinisterBreaking News AP Welfare Schemes Artificial Intelligence in AP BC Hostel Monitoring BC Welfare Andhra Pradesh latest news Minister S Savita Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.