📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Minister Savita: మహిళలకు గార్మెంట్ పరిశ్రమల్లో ఉపాధి

Author Icon By Anusha
Updated: September 26, 2025 • 11:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

విజయవాడ : మహిళా సాధికారితలో భాగంగా టైలరింగ్లో ఉచిత శిక్షణ పొందిన మహిళలకు రాష్ట్రంలోని వివిధ గార్మెంట్ పరిశ్రమల్లో ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత (Minister Savita) తెలిపారు. శాసన సభా సమావేశాల్లో ఆరో రోజు గురువారం ఎమ్మెల్యే బత్తుల బాల: రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సవిత పైవిధంగా సమాధానమిచ్చారు. మహిళా పక్షపాతి సీఎం చంద్రబాబు  (CM Chandrababu Naidu) అని, ప్రతి ఇంటి నుంచి మహిళను పారిశ్రామిక వేత్తగా తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు.

Tirumala: భక్తులకు మరింత అదనపు వసతి సంతోషం

అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో మహిళల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు (Welfare schemes) అమలు చేస్తున్నారన్నారు. 2019–24 మధ్య అప్పటి ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు. మళ్లీ సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నా రన్నారు.

Minister Savita

దీనిలో భాగంగా, ఏపీ బీసీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి మహిళల జీవనోపాధి నిమిత్తం ఉచిత టైలరింగ్ శిక్షణ (Free tailoring training) అందజేస్తున్నామన్నారు. 90 రోజుల పాటు టైలరింగ్ శిక్షణ అందజేస్తున్నామన్నారు.

మహిళలకు కుట్టు శిక్షణ విజయంతంగా

శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్ ఉచితంగా ఇవ్వడమే కాకుండా సర్టిఫికెట్ కూడా ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో మహిళలకు కుట్టు శిక్షణ విజయంతంగా నిర్వహిస్తున్నామని, శిక్షణ పట్ల మహిళల్లో సంతోషం వ్యక్తమవుతోందన్నారు. శిక్షణకు హాజరయ్యే మహిళలను ఫేషీయల్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) హాజరు తీసుకుంటున్నామన్నారు.

మహిళల ఉపాధి కల్పనకు ఏపీ స్కిల్ డవలప్మెంట్తో కలిసి పనిచేస్తున్నా మన్నారు. పలు గార్మెంట్ సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి, టైలరింగ్లో శిక్షణ పొందిన మహిళలకు ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత సభకు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News employment opportunities free tailoring training garment industries latest news Minister Savita mla battula balaramakrishna Telugu News Women Empowerment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.