📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్

Telugu news: Minister Sandhyarani: అంగన్వాడీ వర్కర్లకు 5G ఫోన్లు

Author Icon By Tejaswini Y
Updated: December 11, 2025 • 12:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Minister Sandhyarani: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా సేవల్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు 5 జి మొబైల్ ఫోన్లను అందిస్తున్నామని మహిళాభివృద్ది శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ కలెక్టరేట్ పింగళి వెంకయ్య(Pingali Venkayya) సమావేశ మందిరంలో బుధవారం అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 58,204 మంది అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు 5 జి స్మార్ట్ ఫోన్లను అందించే కార్యక్రమాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లకు రూ.75 కోట్ల వ్యయంతో మొబైల్ ఫోన్లను పంపిణీ చేసామన్నారు.

Read also: Ambati vs Pawan: పవన్ కళ్యాణ్‌కు నీతి లేదు, సిద్ధాంతం లేదు: మాజీ మంత్రి ధ్వజం

Minister Sandhyarani: 5G phones for Anganwadi workers

మహిళా–శిశు సంక్షేమ శాఖకు A++ ర్యాంక్

గత ప్రభుత్వం ఇచ్చిన 4 జి ఫోన్ లు సరిగ్గా పనిచేయలేదని, అందుకే కూటమి ప్రభుత్వం 5 జి నెట్ వర్క్ తో ఫోన్ లు అందించామన్నారు. కూటమి ప్రభుత్వంలో శాఖల, రాష్ట్రవ్యాప్తంగా 55,204 అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు లక్షా 25 వేల మంది సేవలు అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు సచివాలయంలో మంత్రులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల ర్యాంకులు ప్రకటించగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర స్థాయిలో 98 శాతం సేవలతో ఏ++ కేటగిరి తో నాలుగో స్థానంలో నిలవటం అభినందనీయమన్నారు. దీన్ని నూరు శాతం సాధించే దిశగా ఉద్యోగులు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ర్యాంకింగ్ లో చివరి స్థాయిలో ఉండగా నేడు నాలుగో స్థాయికి తీసుకురావడం వెనుక ఉద్యోగులందరి సహకారంతో ఇది సాధ్యమైందన్నారు.

పిల్లల ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ

గ్రామాల్లో తల్లిండ్రులు తమ చిన్నారులను నమ్మకం, ధైర్యం, విశ్వాసంతో అంగన్వాడీలకు పంపిస్తున్నారన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా లో అంగన్వాడీ సెంటర్స్ లో పిల్లలను అందంగా తయారు చేయటానికి (పిల్లలను అందంగా అలంకరించటానికి) ముస్తాబు అనే ఒక కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించి మంచి ఫలితాలు సాధించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాలంలోనే 3 సార్లు రూ. 1200 నుంచి రూ.2,200 తిరిగి ఎన్ని ఆర్థికి ఇబ్బందులు ఉన్నప్పటికీ రూ.11,500 వరకు వేతనాలు పెంచిన ఘనత ఆయనకే దక్కు తుందన్నారు.

టీచర్లు–ఆశా వర్కర్లకు పథకాల అర్హతపై త్వరలో నిర్ణయం

గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు కూడా ప్రభుత్వ పథకాలకు అర్హత కలిగేలా ముఖ్యమంత్రి ధృష్టికి తీసుకెళ్లామని, దీనిపై త్వరలో సానుకూల నిర్ణయం ఉంటుందన్నారు. 7 వేల అంగన్వాడీల్లో 5 వేల మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని, మిగిలిన అంగన్వాడీలలో ఉన్న టీచర్లకు 10 తరగతి అర్హత వచ్చిన అనంతరం మెయిన్ అంగన్వాడీలుగా చేస్తామన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లో పనిచేసే సిబ్బందిని అన్ని విధాల ఆదుకుంటున్నామన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

5G Mobile Phones Anganwadi workers AP Government Gummidi Sandhya Rani Women and child welfare

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.