📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : Minister – సాకేత్ కు భారీ నజరానాతో పాటు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం : మంత్రి పార్థసారథి

Author Icon By Shravan
Updated: August 22, 2025 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ Minister : అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ (International tennis player) సాకేతాసాయి మైనేనికి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ (గ్రూప్1 సర్వీసెస్)గా ఉద్యోగం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖా మంత్రి కొలసు పార్ధసారధి తెలిపారు. సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ఏపీ. (అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్) చట్టం, 1994 (చట్టం 2 ఆఫ్ 1994) లోని సెక్షన్ 4ను సవరించేందుకు ఎపి శాసనసభ బిల్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు.. సాకేత్ సాయి మైనేని 2014లో దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో జరిగిన ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్ స్వర్ణ పతకాన్ని పురుషుల డబుల్స్ రజత పతకాన్ని సాధించారు. అలాగే 2016 మరియు 2019 సంవత్సరాల్లో జరిగిన ఆసియా క్రీడల్లో 2 స్వర్ణ పతకాలు మరియు 2 రజత పతకాలను సాధించారు. మొత్తంగా 15 అంతర్జాతీయ ఛాలెంజర్ టైటిల్స్, 28 అంతర్జాతీయ ఫ్యూచర్ టైటిల్స్ గెలుచుకున్నారు. వీరి అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా 2017లో ప్రతిష్టాత్మక అర్జున అవార్డు ప్రదానం చేయబడింది.

భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్రీడా రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా వీరిని రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్గా నియమిం చాలని ప్రతిపాదించడం జరిగిందన్నారు. భారత ఉన్నత న్యాయస్థానం క్రిమినల్ రిట్ పిటిషన్ (క్రిమినల్) నెం.511 ఆఫ్ 2024లో ఇచ్చిన ఉత్తర్వులు, నిబంధనలతో పాటు సిబ్బందితో పాటు శ్రీకాకుళంలో స్పెషల్ కోర్టును ఏర్పాటు జేసి కేశవరావు అలియాస్ దున్న కేశవరావుకు వ్యతిరే కంగా నమోదై విచారణ జరుగుచున్న16 కేసుల విచారణను అదనపు జిల్లా సెషన్స్ కోర్ట్కమ్ స్పెషల్ కోర్ట్ నియమించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ ఆధారంగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్లో ఐబిఎం క్వాంటం కంప్యూటర్ ఇన్స్టాలేషన్కు ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో తొలి క్వాంటం కంప్యూటర్ – అంగన్వాడీ వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్

ఈ క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే తొలిసారిగా ఒక ఫిజికల్ క్వాంటం కంప్యూటర్కలిగిన రాష్ట్రంగా నిలుస్తుంది. ఔషధ ఆవిష్కరణ, వ్యవసాయం, పదార్థ శాస్త్రం, కృత్రిమమేధస్సు మరియు సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలో విప్లవాత్మక సామర్థ్యాలను అందిస్తుంది. విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు గ్లోబల్ భాగస్వాములతో కలసి అత్యాధునిక పరిశోధనలు చేయగలుగుతాయి. అలాగే కొత్తస్టార్టప్లు, పరిశ్రమలు మరియు ప్రతిభావంతులైన యువతకు అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుత ప్రభుత్వఎన్నికల వాగ్దానాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 సంవత్సరాల వయస్సునిండిన అంగన్వాడీవర్కర్లు మరియు అంగన్వాడీ హెల్పర్లకు సర్వీస్ ముగింపు (Retirement Benefits) ప్రయోజనాలకు బదు లుగా, అంగన్వాడీ వర్కర్ల (మినీ, మెయిన్)కు రూ.1,00,000/ అంగన్వాడీ హెల్పర్లకు రూ.40,000/ గ్రాట్యుటీగా చెల్లించడానికి ప్రభుత్వం అత్యవసరంగా జారీ చేసిన ఉత్తర్వులు జిఓ ఎంఎస్ నెంబర్.8,ని ర్యాటిపై చేయడానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం మరియు సీనియర్ సిటిజన్ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/change-in-numbers-of-south-central-railway-passenger-trains/national/534144/

Andhra Pradesh politics AP Latest Updates Breaking News in Telugu Latest News in Telugu Minister Parthasarathi Politics News Saketh Deputy Collector Job Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.