📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Minister NMD Farooq : బనకచర్లపై తెలంగాణ అభ్యంతరాలు సబబుకాదు…

Author Icon By Shravan
Updated: August 5, 2025 • 9:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : తెలంగాణలోని కాళేశ్వరం (Kaleshwaram) పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క
సాగర్, గౌరవెల్లి, సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులూ లేవని వీటిపై ఏపీ ఎప్పుడూ అభ్యంతరాలు పెట్టకున్నా ఏపీ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణా అభ్యంతరాలు వ్యక్తం చేస్త్నుడటం సబబు కాదని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. గోదావరి నీటిని సద్వినియోగం చేసుకునే విషయంలో తెలంగాణాకి ఓ న్యాయం, ఏపీకి ఓ న్యాయమా అని, ద్వంద ప్రమాణాలు ఎంతవరకు సమంజసమన్నది తెలంగాణ ఆలోచించాలని సోమవారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.. గోదావరి నుంచి ఏటా సగటున 3000 టీఎంసీల వరద నీరు సముద్రంలో కలుస్తోందన్నారు. 2025 సీజన్ ఆరంభంలోనే ఇప్పటి వరకూ 813 టీఎంసీల నీరు దిగువన సముద్రంలో కలిసిపోయిందని వెల్లడించారు.

ప్రపంచంలోనే 50 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించే అవకాశం ఉన్న నదిగా గోదావరి విశిష్టమైన ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు. గోదావరి నదికి దిగువ రాష్ట్రంగా సముద్రంలో కలిసే నీటిని వినియోగించుకునేందుకు ఏపీ సర్వహక్కులూ కలిగి ఉందని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు. పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టుతో సముద్రంలోకి వృథాగా కలిసే జలాలను మాత్రమే రాయలసీమకు తరలించాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికకు శ్రీకారం చుట్టిందన్నారు. సాగునీటి అవసరాలకు కూడా నీటిని వినియోగించుకునే అవకాశం ఉందన్నారు.

తెలంగాణా సరిహద్దు తర్వాత భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న శబరి, సీలేరు, తాలిపేరు నుంచి పెద్ద ఎత్తున నీటి ప్రవాహాలు ప్రధాన నదిలో కలుస్తున్నాయన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ముఖ్యంగా రుతుపవనాల సీజన్ లో నవంబరు వరకూ 100 రోజుల పాటు డిస్ట్రిబ్యూటరీస్ నుంచి గోదావరిలోకి వరద ప్రవాహాలు కొనసాగుతాయని అన్నారు. ఒడిశా నుంచి శబరీ నది కూనవరం వద్ద గోదావరిలో కలుస్తోందని, సీలేరు, పొట్టేరుల నుంచి శబరి ఉపనదికి వచ్చే ప్రవాహాలు భారీగానే ఉంటాయన్నారు. శబరి నుంచి ఏటా దాదాపు 270 టీఎంసీల నీటి ప్రవాహం గోదావరిలో కలుస్తోందని తెలిపారు.

సీలేరు నుంచి వచ్చే వరద నీటి ప్రవాహాం కూడా భారీగానే ఉంటుందన్న విషయం తెలిసిందేనని పేర్కొన్నారుగోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టును కట్టుకున్న తెలంగాణా పూర్తిగా ప్రాణహిత నుంచి వచ్చే నీటిని మళ్లించుకుంటోందని మంత్రి ఫరూక్ అన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా కాళేశ్వరం, సీతారామ సాగర్, ఇతర ఎత్తిపోతల పథకాల ద్వారా 296 టీఎంసీలను తెలంగాణా తన అవసరాల కోసం తరలించుకుంటోందని మంత్రి విమర్శించారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా కలుస్తున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకే పోలవరంబనకచర్ల లింకు ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించిందని ఈ విషయంపై తెలంగాణ విమర్శలు సరికాదన్నారు. సముద్రంలో కలిసే నీటిని వరద కాలంలో మాత్రమే రోజుకు 2 టీఎంసీల చొప్పు 200 టీఎంసీల వరకూ నీటిని కరవుపీడిత ప్రాంతాలకు తరలిస్తే ఎగువ రాష్ట్రానికి వచ్చే ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.

నీటి వనరుల సద్వినియోగం చేసేందుకు, రాయలసీమ లాంటి కరవు ప్రాంతాల దాహార్తిని, సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టుపై అనవసరపు రాద్దాంతం చేస్తున్నారని మంత్రి ఫరూక్ ద్వజమెత్తారు. లోవర్ రైపీరియన్ రైట్స్ అనేది నదీ జలాల చట్టంలో ఓ ముఖ్యమైన అంశమని దిగువ పరివాహక ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు.

సముద్రంలోకి కలిసే 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలను మాత్రమే పోలవరం బనకచర్ల ప్రాజెక్టుద్వారా వినియోగించుకోవాలని భావిస్తున్నామని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. జీడబ్ల్యూడిటి అవార్డులోని క్లాజ్ 4 ప్రకారం రాష్ట్రాలకు, గోదావరి నుండి ఇతర రివర్ బేసిన్లకు నీటిని తరలించే హక్కు ఉందని మంత్రి వెల్లడించారు. ఆ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం కాలేశ్వరం, సీతారామ లిప్టు ప్రాజెక్టులు చేపట్టిందని, కొన్ని అనుమతులు ఈ క్లాజు ప్రకారమే వారికి కేంద్ర జలసంఘం ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ హక్కుతోనే బనకచర్ల ప్రాజెక్టును చేపడుతోందని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు సానుకూలమేనని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని, రెండు తెలుగు రాష్ట్రాల రైతులు, ప్రజలు గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నదే చంద్రబాబు లక్ష్యమని మంత్రి ఫరూక్ అన్నారు. నీటి వనరుల్ని వినియోగించుకుని రెండు రాష్ట్రాల ప్రయోజనాలనూ కాపాడుకుందామని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపునిచ్చారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ MORE :

https://vaartha.com/trump-warning-trumps-tariff-warning-against-india-criticism-over-russian-oil-purchases/international/526055/

Andhra Pradesh irrigation AP Telangana water Breaking News in Telugu Google news Latest News in Telugu NMD Farooq Telangana objections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.