📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Amaravati : అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన!

Author Icon By Sudheer
Updated: July 22, 2025 • 8:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం (Amaravati) మూడేళ్లలో పూర్తిచేసే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కానున్నాయని తెలిపారు. సీఆర్డీఏ ఇంజినీర్లతో కలిసి నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించగా, మంత్రులు, న్యాయమూర్తులు, ముఖ్య కార్యదర్శులు, అధికారులు తదితరుల కోసం బంగ్లాలు, క్వార్టర్లు నిర్మిస్తున్న పనులను ఆయన సమీక్షించారు. టెండర్లు, కాంట్రాక్టర్ల వివరాలు, పని వేగం, కార్మికుల సంఖ్య వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు.

ఫ్లాట్లు, బంగ్లాలు, ట్రంక్ రోడ్ల నిర్మాణం

అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్ అధికారులు, నాన్ గెజిటెడ్, గెజిటెడ్ ఉద్యోగుల కోసం టవర్స్‌, ఫ్లాట్లు, బంగ్లాల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని మంత్రి (Narayana) తెలిపారు. మొత్తం 12 టవర్లలో 288 ఫ్లాట్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం, 6 టవర్లలో 144 ఫ్లాట్లు ఏఐఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్నారు. అదేవిధంగా, సెక్రటరీలు, జడ్జిలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, గ్రూప్-డి ఉద్యోగుల కోసం అనేక టవర్లలో వేలాది ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నాయి. హ్యాపీనెస్ట్‌లో 1200 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాల్లో చాలా భాగం ఈ ఏడాది డిసెంబరులో, మిగతావి వచ్చే ఏడాది మార్చిలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఐకానిక్ భవనాల నిర్మాణానికి సంబంధించి తుది చర్చలు జరుగుతున్నాయనీ, త్వరలో ప్రారంభమవుతాయనీ వెల్లడించారు.

భూకేటాయింపు, ల్యాండ్ పూలింగ్‌పై ప్రగతి

ఇప్పటివరకు అమరావతిలో 72 సంస్థలకు భూములు కేటాయించామని, వాటిలో మెజారిటీ సంస్థలు డిసెంబర్ నాటికి నిర్మాణాలు ప్రారంభిస్తాయని మంత్రి చెప్పారు. వీటికి సంబంధించిన అగ్రిమెంట్లు స్వయంగా సీఎం చంద్రబాబు ఏర్పాటుచేసిన సమావేశాల్లో చేయబడ్డాయని తెలిపారు. రెండో దశ ల్యాండ్ పూలింగ్‌పై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. భవిష్యత్తులో అమరావతిని అభివృద్ధి చేసిన విధంగా ప్రభుత్వం ప్రతిదశలో తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

Read Also : Annavaram Devender : అన్నవరం దేవేందర్ కు దాశరథి పురస్కారం

Amaravati Minister Narayana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.