📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Minister Narayana: అన్ని హంగులతో కూడినపార్క్ షటిల్ కోర్టును ప్రారంభించిన మంత్రి నారాయణ

Author Icon By Anusha
Updated: July 24, 2025 • 4:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నెల్లూరు : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పార్కుల పండుగ కొనసాగుతుంది. నగరంలోని తొమ్మిదో డివిజన్ ఎఫ్సీఐ కాలనీ (Division FCI Colony) లో 60 లక్షల రూపాయలతో ఆధునీకరించిన పార్కు, అదే విధంగా 13 డివిజన్లో 15 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన షటిల్ కోర్టును రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో కలిసి ప్రారంభించారు. ముందుగా డివిజన్ కు విచ్చేసినటువంటి మంత్రి నారాయణ (Minister Narayana) కు స్థానిక మహిళలు మంగళహారతులతో పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అభివృద్ధి ప్రదాతకు జై అంటూ నినాదాలు చేపట్టారు. అన్ని హంగులతో పార్కులో ఆహ్లాదభరిత వాతావరణం కల్పించిన మంత్రికి స్థానిక చిన్నారులు, ప్రజలు కృతజతలు తెలిపారు. అనంతరం మంత్రి పిల్లలతో ఆటలాడించి షటిల్ సరదాగా ఆడి ఉత్సాహాన్ని నింపి చాక్లెట్లను పంచిపెట్టారు.

Minister Narayana: అన్ని హంగులతో కూడినపార్క్ షటిల్ కోర్టును ప్రారంభించిన మంత్రి నారాయణ

ప్రతి ఇంటికి

అనంతరం మీడియాతో మాట్లాడుతూ షటిల్ కోర్టును, పార్కును ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. సిటీలో 56 స్థలాలను గుర్తించి పార్కులుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని, పిల్లల కోలాహాలం చూస్తే ఆనందంగా ఉందన్నారు. పని చేసే ప్రభుత్వం ఎలా ఉంటుందో చూస్తున్నారని, విజయదశమి నుంచి సిటీలో రోడ్లను స్వీప్పింగ్ మిషన్లతో శుభ్రం చేస్తారని, రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేస్తామన్నారు. ఆరు జిల్లాల్లో సాలిడ్ వెస్ట్ మెనేజ్మెంట్ ప్లాంట్లు (Solid Waste Management Plants) ఏర్పాటు చేశామని, ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా మారుస్తామన్నారు. డ్రైన్ల పనులు కూడా పూర్తి చేస్తామని, నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.165 కోట్లు మంజూరు చేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సాగునీటి కాలువల పనులు కూడా ప్రారంభిస్తామని దోమల రహితంగా నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దు తామన్నారు. మాది మాటల ప్రభుత్వం కాదని, ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు.

ఆయన ఏ నియోజకవర్గానికి చెందిన వారు?

డాక్టర్ నారాయణ నెల్లూరు జిల్లాకు చెందినవారు. నెల్లూరు సిటీ అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారు.

పొంగూరు నారాయణ విద్యార్హత ఏమిటి?

డాక్టర్ నారాయణకు డాక్టరేట్ ఉన్నది. ఆయన విద్యార్థులకు చదువు మీద ఆసక్తి కలిగేలా మద్దతిచ్చే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: CM Chandrababu: యోగాతో అద్భుత ఫలితాలు

Breaking News development FCI colony kotamreddy srinivasulu reddy latest news nellore city ninth division NUDA chairman parks ponguru narayana Public Welfare shuttle court thirteenth division

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.