📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu news: Minister Narayana: 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Author Icon By Tejaswini Y
Updated: December 5, 2025 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక రాజధాని నిర్మాణం ఆలస్యమైందని ఏపీ నగర, పట్టణాభివృద్ధిశాఖా మంత్రి పి. నారాయణ(Minister Narayana) తెలిపారు. కాంట్రాక్టర్లుకు బకాయిలు చెల్లించి పనులు ప్రారంభించేనాటికి వర్షాలు ముంచెత్తాయి. అంతర్జాతీయ రాజధాని నిర్మాణంలో భాగంగా స్మార్ట్ ఇండస్ట్రీలు, అంతర్జాతీయ విమానాశ్రయం(International Airport), స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సీఎం నిర్ణయించారని వివరించారు.

Read also: Cases of Scrub Typhus : ఏపీ రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్న చిగ్గర్ అనే పురుగు

రహదారి నిర్మాణానికి ప్రణాళికలు

Minister Narayana International sports city on 2,500 acres

పల్నాడు జిల్లాలో రైతులు ఇచ్చిన భూమిలో 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తాం. గతంలో భూ సమీకరణ సమయంలో విధానాలే ఇక్కడా అమలు చేస్తాం. ట్రంకురోడ్లు, ప్రధాన రహదారులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. నాలుగు, ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాం. ఇక్కడ కూడా ఏడాదిలోనే స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం మండలం ?అమరావతి యండ్రాయిలో రెండో విడత భూసమీకరణలో 7 వేల తీసుకుంటున్న ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారాయణ(Minister Narayana) స్పష్టం చేశారు.

రెండో భూసమీకరణ చేపడుతున్న ప్రాంత రైతులతో పల్నాడు జిల్లా యండ్రాయిలో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. యండ్రాయి, వైకుంఠపురం, పెద్దమత్తూరు, కర్లపూడి రైతులతో పాటు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సమావేశంలో పాల్గొన్నారు. భూసమీకరణపై రైతుల అభిప్రాయాలను మంత్రి నారాయణ తెలుసుకున్నారు. భూసమీకరణపై రాజధాని రైతుల విషయంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ట్రంకు రోడ్లు, ప్రధాన రహదారులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

2500 Acres Project Andhra Pradesh Development International Sports City Mega Sports Hub Minister Narayana Sports Infrastructure

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.