📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Latest News: Minister Nara Lokesh -సెల్యూట్ పోలీసన్నా..మంత్రి నారా లోకేష్ ట్వీట్

Author Icon By Anusha
Updated: September 22, 2025 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : ఆంధ్రప్రదేశ్లోని ఓ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ కు మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) సెల్యూట్ చేశారు. పౌర సేవల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ కు అర్థం చెప్పారని ప్రశంసించారు. ఈ మేరకు మంత్రి లోకేష్ ఎక్స్లో ఒక పోస్టు షేర్ చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు ట్రాఫిక్ విభాగంలో వెంకటరత్నం హెడ్ కానిస్టేబుల్ (Head Constable) గా విధులు నిర్వర్తిస్తున్నారు. వైపు తన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే… మరోవైపు మానవత హృదయంతో స్పందించారు. చెప్పులు లేకుండా ఎండలో నడిచి వెళ్తున్న నిరుపేదలైన చిన్నారులను చూసి తల్లడిల్లిపోయారు. వారిని షాపులోకి తీసుకెళ్లి కొత్త చెప్పులు కొనిచ్చారు.

అందుకు సంబంధించిన బిల్లును చెల్లించారు. అప్పటివరకు ఎండలో చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్లిన పిల్లలు… తమ కాళ్లకు కొత్త చెప్పులు రావడంతో ఆనందంలో మునిగి పోయారు. వెంకటరత్నం (Venkata Ratnam) కు థాంక్యూ సార్ అని చెప్పారు. అయితే ఈ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్గా మారింది. అయితే ఈ వీడియోపై స్పందించిన మంత్రి లోకేష్.. “హ్యాట్సాఫ్ వెంకటరత్నం గారు… స్పందించిన మీ మనసుకు సెల్యూట్ అంటూ పోస్టు చేశారు.

థాంక్యూ సార్ అని చిన్నారులు బహుమతిగా విసిరిన చిరునవ్వు

ఎండనక, వాననక అప్రమత్తంగా ట్రాఫిక్ని నియంత్రించే విధి నిర్వహణ… అటెన్షన్, టెన్షన్లు ఉన్నా పెనమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ (Penamalur Traffic Head Constable) వెంకటరత్నం స్పందించిన తీరుకు హ్యాట్సాఫ్. చెప్పులు లేకుండా ఎండలో నడిచి వెళ్తున్న స్కూల్ పిల్లలను చూసి తల్లడిల్లిపోయారు. వారందరినీ ఓ చెప్పుల దుకాణానికి తీసుకెళ్లి సరిపడే సైజు చెప్పులు కొనిచ్చారు. చెప్పులు వేసుకుని వెళ్తూ, థాంక్యూ సార్ అని చిన్నారులు బహుమతిగా విసిరిన చిరునవ్వుతో,వెంకటరత్నం ముఖంలో సంతృప్తి.. వెల్లివిరిసిన ఎంత గొప్పది! ఇంకెంత అమూల్యమైనది.

మీకు సెల్యూట్ వెంకటరత్నం అని లోకేష్ పేర్కొన్నారు. ఇదే వీడియోపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. వెంకటరత్నంకు అభినందనలు తెలి పారు. ఈ మేరకు అనిత ఎక్స్లో ఒక పోస్టు చేశారు. పౌర సేవల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్కు (friendly policing) అర్థం చెప్పిన ట్రాఫిక్ పోలీస్ వెంకటరత్నంకు అభినందనలు చెప్పారు. పేద పిల్లల కష్టాలను చూసి చలించి మానవత్వంతో స్పందించిన తీరు అభినందనీయమని, ఫ్రెండ్లీ పోలీసింగ్ నినాదంతో రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిస్తున్న పోలీసుల కృషికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు.

తన సొంత డబ్బుతో చెప్పులు కొనివ్వడం

విధినిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తూనే మానవత్వంతో స్పందించి నిరుపేదలైన చిన్నారులకు తన సొంత డబ్బుతో చెప్పులు కొనివ్వడం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న వెంకటరత్నం రియల్ హీరో అని చెప్పడానికి సందేహం లేదని అన్నారు. వెంకటరత్నం అమూల్యమైన సేవలకు హ్యాట్సాఫ్… అని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/raghurama-krishnam-raju-raghurama-krishnan-fires-at-jagan-over-assembly-boycott/andhra-pradesh/551797/

#telugu News Breaking News children's happiness community support gratitude heartwarming moment latest news Minister Lokesh new shoes social media viral Venkata Ratnam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.