📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Minister Muralidhar Mohol: ఏపి నుంచి వారానికి 1,194 విమానాల రాకపోకలు

Author Icon By Anusha
Updated: July 23, 2025 • 12:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం వారానికి 1,194 విమానాలు రాకపోకలు సాగిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్ మొహోల్ (Muralidhar Mohol) తెలిపారు. రాజ్యసభలో టిడిపి సభ్యుడు బీద మస్తాన్రావు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. రాష్ట్రంలో 2021లో ఓర్వకల్లు విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిందని, ప్రస్తుతం భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పురోగతిలో ఉందన్నారు. గతదర్తి విమానాశయం నిర్మాణం కోసం 2018లో కుదుర్చుకున్న కన్సెప్ఫన్ అగ్రిమెంట్ను ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని పేర్కొన్నారు. 2008 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఈ ప్రాజెక్ట్ను అమలు చేయాలంటే కొత్త ఎయిర్ పోర్టు డెవలపన్ను ఎంచుకోవడంతో పాటు భూసేకరణ, చట్టబద్దమైన అనుమతులు, ఆర్థిక వనరులను సమకూర్చు కోవాల్సి ఉంటుందన్నారు. కుప్పంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ (Greenfield Airport) అభివృద్ధికి అసవరమైన స్థలానుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం గత జూన్లో ధరఖాస్తు పంపిందని చెప్పారు.

Minister Muralidhar Mohol: ఏపి నుంచి వారానికి 1,194 విమానాల రాకపోకలు

భధ్రతా నిబంధనల్లో

ఉడాన్ 5.50 అరకు, గండికోట, కాకినాడ, కోనసీమ, లంబ సింగ్, నర్సాపూర్, ప్రకాశం బ్యారేజీ, రుషికొండ, శ్రీశైలం, తిరుపతి, నాగార్జునసాగర్ ల నుంచి సీప్లేన్ల నిర్వహణక అవసరమైన బిడ్డింగ్లు దాకలు చేసుకోవాడానికి వీలుగా ఎయిర్లైన్ ఆపరేటర్లకు లెటర్ ఆఫ్ ఇండెం ట్(ఎల్ఎఐ)లు జారీ చేసినట్లు వైకాపా సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
సీ ప్లేన్ల నిర్వహణ కోసం డిజీసీఏ భధ్రతా నిబంధనల్లో సవరణలు చేసిందని, దీని ప్రకారం శిక్షణావసరాలు, అనుమతుల ప్రక్రియ, స్థలం ఎంపిక సరళంగా ఉంటుం దన్నారు. కేంద్ర ప్రభుత్వ రక్షణలో 135 పురాతన స్మారక కేంద్రాలు కేంద్ర ప్రభుత్వ రక్షణలో ఆంధ్రప్రదేశ్ 135 పురాతన కేంద్రాలు ఉన్నట్లు కేంద్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ తెలిపారు. ఆయన లోక్సభలో టిడిపి సభ్యుడు జీఎం హరీష్ మాథుర్ (GM Harish Mathur) అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. వీటి కోసం గత నాలుగేళ్ళలో రూ.36 కోట్లు కేటాయించగా, అందులో రూ.35 కోట్లు ఖర్చయినట్లు వెల్లడించారు.

మురళీధర్ మొహోల్ ఏయే పదవులు నిర్వహించారు?

పూర్వంలో మురళీధర్ మొహోల్ పుణే మహానగరపాలికా మేయర్‌గా సేవలందించారు.ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు.

మురళీధర్ మొహోల్ ఏ పార్టీకి చెందినవారు?

మురళీధర్ మొహోల్ భారతీయ జనతా పార్టీ (BJP) నాయకుడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Tirumala: నూతన శ్రీవాణి దర్శన టికెట్ల కేంద్రంతో భక్తులకు మరింత సౌలభ్యం

Andhra Pradesh air traffic bhogapuram airport Muralidhar Mohol Orvakallu airport TDP Beeda Mastan Rao Telugu News Vijayawada flights

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.