📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Minister Lokesh: మండలానికో జూ. కళాశాల, చిత్తూరులో కొత్త విశ్వవిద్యాలయం

Author Icon By Anusha
Updated: September 25, 2025 • 10:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చేనేత ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం

అసెంబ్లీలో మంత్రి లోకేష్

విజయవాడ : అభివృద్ధికి సంక్షేమానికి ఎవ్వరు అడ్డంకులు వేయ లేరని రాష్ట్ర విద్యాశాఖమంత్రి నారాలోకేష్ (Minister Lokesh) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ నిలిపివేయించేందుకు వైఎస్సార్సీ నాయకులు అనేక రీతుల్లో ప్రయత్నించి భంగపడ్డా రన్నారు. ఏ అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో భాగంగా లోకేష్ అనే అంశాలపై బదులిచ్చారు. డిఎస్సీ నియామకాలపై, వైఎస్సార్సీ ప్రభుత్వం అడ్డుకోవడం కోసం వందకు పైగా కేసులు వేసిందని, అయినప్పటికీ వాటిని అధిగమించి విజయవంతంగా డిఎస్సీ (DSC) నిర్వహించామని లోకేష్ తెలి పారు. ఉపాధ్యాయ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 25న అమరావతి వెలగ పూడిలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానిస్తూ, తమ నియోజకవర్గం పరిధిలో ఎంపికైన ఉపాధ్యాయులను అభినందించమని కోరారు. ఉపాధ్యాయ నియామకాలతో పాటు రాష్ట్రంలో విద్యా ప్రమాణా లను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుం దని ఆయన స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసే అంశంపై ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావు, తుని ఎమ్మెల్యే యన మల దివ్య అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ కీలకవిషయాలను వెల్లడించారు.

ఉపాధ్యాయ నియామకాలలో పారదర్శకత వంటి అంశాలపై

చిత్తూరులో కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటు, జూనియర్ కళాశాలల అభివృద్ధి, చేనేత రంగ ప్రోత్సాహం, ఉపాధ్యాయ నియామకాలలో పారదర్శకత వంటి అంశాలపై మంత్రి నారా లోకేష్ సవివరంగా తెలిపారు. విద్య, చేనేత రంగాలకు కొత్త ఊపుని ఇస్తు న్నాయి. చేనేతరంగాన్ని అభివృద్ధి చేయ డంలో ప్రభుత్వంకట్టుబడి ఉందని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.

చేనేత ఉత్పత్తుల (Handloom products) ప్రోత్సాహానికి ప్రత్యేక బృందాన్ని ఎమ్మెల్యేలతో కలిసి ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యార్థులకు సరఫరా చేసే యూనిఫాంల తయారీ విషయంలో గతంలో చేనేత సంఘాలకు అవకాశం ఇవ్వాలనుకున్నా, వివిధ కారణాల వల్ల సాధ్యం కాలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం వేర్వేరు సంస్థల ద్వారా యూనిఫాం తయారీ జరుగుతున్నా, నాణ్యత, మన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.

చేనేతలకు ప్రోత్సాహం కల్పించే దిశగా మంగళగిరిలో వీవర్స్ శాల ఏర్పాటు

అదేవిధంగా విద్యార్థులకు అందించే సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్ల కొనుగోళ్లలో పారదర్శకత పెంచి, ఏటా 200 కోట్ల రూపాయలు ఆదా చేస్తున్నామని చెప్పారు. చేనేతలకు ప్రోత్సాహం కల్పించే దిశగా మంగళగిరిలో వీవర్స్ శాల ఏర్పాటు చేశామని, కొత్త డిజైన్లు, బ్రాండింగ్, ప్రమోషన్పై చర్యలు చేపడుతున్నామని వివరించారు. చిత్తూరు జిల్లా (Chittoor District) లో ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ద్రవిడియన్ యూనివర్సిటీ, ప్రైవేటు రంగంలో అపోలో యూనివర్సిటీ మాత్రమే ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.

Minister Lokesh

ముఖ్యమంత్రి హామీ మేరకు జిల్లాకు ఒక ప్రభుత్వ లేదా ప్రైవేటు విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ద్రవిడియన్ యూనివర్సిటీ (Dravidian University) ప్రధానంగా భాషాపరమైన విశ్వవిద్యాలయమే కావడంతో, చిత్తూరుకు ప్రత్యేకంగా వేరే యూనివర్సిటీ అవసరం ఉందని లోకేష్ చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

జూనియర్ కళాశాలలు నిర్వీర్యం అయ్యాయని

తుని నియోజకవర్గం తొండంగి మండలంలోని రావికంపాడు హైస్కూలును జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే యనమల దివ్య చేసిన విజప్తిపై మంత్రి స్పందించారు. గత ప్రభుత్వ కాలంలో జూనియర్ కళాశాలలు నిర్వీర్యం అయ్యాయని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని పునరుద్ధరిస్తూ విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు.

జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు 40 శాతం పెరిగాయని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు కాంపిటీటివ్ మెటీరియల్ అందిస్తున్నామని వివరించారు. ప్రతి మండలంలో ఒక జూనియర్ కళాశాల ఉండేలా నిర్ణయం తీసుకున్నామని, రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ లక్ష్యాన్ని పూర్తిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.

పారిశ్రమిక వేత్తలను ఒప్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని

ఇక టిటిడి పరకామణిలో చోరీ వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపేందుకు త్వరలో ప్రభుత్వం ‘సిట్’ వేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. పారిశ్రమిక వేత్తలను ఒప్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని అక్టోబరు నుంచి రాష్ట్రానికి వరుస పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు సిద్ధంచేశామన్నారు. 20లక్షల ఉద్యోగా లకల్పన దిశగా నిర్విరామకృషి జరుగుతోందన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Andhra Pradesh Education Minister Breaking News DSC Appointments latest news Minister Lokesh Teacher Recruitment Telugu News Vijayawada Welfare and Development YSRCP Cases

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.