📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Minister Kandula: ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా

Author Icon By Sushmitha
Updated: October 15, 2025 • 12:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: దేశ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మరింత కేంద్ర సహకారం అందించాలని, కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం రాష్ట్రంలోని తిరుపతి, విశాఖపట్నంలను ప్రపంచ పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దాలని కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన అన్ని రాష్ట్రాల పర్యాటక మంత్రుల సమావేశంలో ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట పాల్గొన్నారు.

Read Also: Crime:పెళ్లి వేడుకలో విషాదం – చెరువులో వ్యక్తి మృతి

రాష్ట్రంలో పర్యాటక పెట్టుబడులు, అభివృద్ధి లక్ష్యాలు

గడిచిన 15 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పర్యాటకాభివృద్ధికి తీసుకున్న చర్యలను మంత్రి దుర్గేష్ వివరించారు. ఈ స్వల్ప కాలంలో దాదాపు రూ.12,000 కోట్ల పర్యాటక పెట్టుబడులు ఆకర్షించామని, తాజ్, ఐటీసీ, ఒబెరాయ్ వంటి ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్లతో కూడిన 21 హోటల్ రిసార్ట్ ప్రాజెక్టులను ఏపీకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటివరకు 18,000 మందికి పైగా ఉద్యోగాలు సృష్టించామని, గ్రామీణ, గిరిజన పర్యాటక సర్క్యూట్లలో 10,000 హోమ్ స్టేలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నేతృత్వంలో పీ4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్‌నర్‌షిప్) నమూనా ద్వారా పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధిని ఏకీకృతం చేస్తున్నామని తెలిపారు.

గమ్యస్థానాల ప్రతిపాదనలు, లక్ష్యాలు

జాతీయ మిషన్ (దేశవ్యాప్తంగా 50 పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధి)లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ తరపున విశాఖపట్నం, తిరుపతిలను ప్రధాన గమ్యస్థానాలుగా ప్రతిపాదిస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2025-26 పేరా.. విశాఖను సముద్రతీర, మెరైన్ గమ్యస్థానంగా, తిరుపతిని ఆధ్యాత్మిక, సాంస్కృతిక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏపీలో భారతదేశపు తొలి ఓషనేరియం, మెరైన్ ఎక్స్‌పీరియన్స్ పార్క్ను కూడా ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు ఆయన వెల్లడించారు. 2029 నాటికి పర్యాటక రంగం రాష్ట్ర జీవీఏలో వాటాను 4.6% నుంచి 8% కి పెంచడం, 5 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించడం తమ లక్ష్యమన్నారు.

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశం ఎక్కడ జరిగింది?

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ సమావేశం జరిగింది.

ఏపీ ప్రభుత్వం ప్రపంచ పర్యాటక గమ్యస్థానాలుగా ఏ ప్రాంతాలను ప్రతిపాదించింది?

విశాఖపట్నం మరియు తిరుపతిలను ప్రతిపాదించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh. central government aid Google News in Telugu kandula durgesh Latest News in Telugu Telugu News Today tirupati Tourism Development visakhapatnam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.