📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Minister Gottipati: భవిష్యత్ విద్యుత్ అవసరాల కోసం కొత్తగా 14 సబ్ స్టేషన్లు

Author Icon By Anusha
Updated: September 24, 2025 • 10:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఓల్టేజ్ సమస్యలు ఇకరావు: శాసనమండలిలో మంత్రి గొట్టిపాటి

విజయవాడ : గృహ, పారిశ్రామిక, వ్యవసాయ అవసరాల భవిష్యత్ డిమాండ్ తీర్చడానికి ట్రాన్స్కో పరిధిలోని 68 ప్రాంతాల్లో రూ.5,500 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. విద్యుత్ సబ్ స్టేషన్ల (Electricity substations) కు సంబంధించి ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర యాదవ్, పేరాబత్తుల రాజశేఖర్, బిటి నాయుడులు అడిగిన ప్రశ్నకు మంగళవారం నాడు శాసన మండలిలో మంత్రి గొట్టిపాటి సమధానం చెప్పారు.

ట్రాన్స్ కో (Trans Co) చేపట్టే వివిధ పనులతో నెట్ వర్క్ ఓవర్ లోడ్ తగ్గడంతో పాటులో ఓల్టేజ్ సమస్యలను తగ్గించడానికి అవకాశం ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 6 నుంచి 8 శాతం విద్యుత్ వినియోగం పెరుగుతుందన్నారు. పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా, అవసరాలకోసం 14 ప్రాంతాల్లో సబ్ స్టేషన్ల నిర్మాణాలను చేపడుతున్నామని స్పష్టం చేశారు. పనులన్నీ పూర్తయితే లో ఓల్టేజ్ సమస్య కూడా తగ్గుతుందని మంత్రి వెల్లడించారు.

అత్యధిక విద్యుత్ డిమాండ్ అందుకోగలుగుతున్నామని

ప్రస్తుతం రాష్ట్రంలో 400 కేవీ సబ్ స్టేషన్లు 18, 220 కేవీ సబ్ స్టేషన్లు 113తో పాటు 132 కెవి సబ్ స్టేషన్లు 244 ఉన్నాయనిమంత్రి గొట్టిపాటి (Minister Gottipati Ravikumar) పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ అందుకోగలుగుతున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీలతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఎంఒయులు చేసుకుంటున్నాయన్నారు.

Minister Gottipati

పరిశ్రమల విద్యుత్ వినియోగానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఐటీ, పరిశ్రమలు, విద్యుత్ శాఖ సంయుక్త కార్యాచరణతో పని చేస్తున్నాయని తెలిపారు. భవిష్యత్ అవసరాల కోసం అవసరమైన చోట సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. 63 ప్రాంతాల్లో 33 కెవి సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు. విశాఖపట్నం (Visakhapatnam) వంటి పట్టణాలలో వర్షాలు పడేప్పుడు, ఇతర సమయాల్లోనూ విద్యుత్ అంతరాయాల సమస్యలను పరిష్కరించడానికి స్కాడా సెంటర్ను ఏర్పాటు చేశామని మంత్రి గొట్టిపాటి గౌరవ సభ్యులకు వివరించారు.

స్కాడా సెంటర్ వేదికగా ఎక్కడ సమస్య ఉందో

స్కాడా సెంటర్ వేదికగా విశాఖ నగర పరిధి లోని సుమారు 110 సబ్ స్టేషన్ పనితీరు పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు. స్కాడా సెంటర్ వేదికగా ఎక్కడ సమస్య ఉందో వెంటనే గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఏ సమస్య అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి గొట్టిపాటి శాసనమండలి సాక్షిగా గౌరవ సభ్యులకు హామీ ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

14 areas Breaking News electricity consumption infrastructure development latest news Minister Gottipati power supply substation construction Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.