📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Minister Durgesh: నంది అవార్డులు త్వరలో – కవులే సమాజానికి మార్గదర్శకులు

Author Icon By Pooja
Updated: February 10, 2026 • 10:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : ప్రకృతి ఒడిలో సాగే సాహిత్య సమ్మేళనాలు సమాజానికి కొత్త దిశానిర్దేశం చేస్తాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్(Minister Durgesh) పేర్కొన్నారు. కవులే సమాజానికి మార్గదర్శకులు, అలసిన హృద యానికి ఓదార్చే అక్షర సెలయేళ్ళు అన్నారు. ఉదయాస్తమానం విజయవాడ భవానిపురం సమీపంలోని హరిత బెర్మ్ పార్కు వద్ద ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, ఏపీ పర్యాటక శాఖ, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన “కృష్ణా తీరం కవితా హారం” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్

Read Also: YSRCP Leaders: పిన్నెల్లి సోదరులను పరామర్శించిన వైసీపీ నేతలు

లక్ష్మీశతో కలిసి బోధిసిరి నౌకలో ప్రయాణిస్తూ, 51 మంది కవులు వినిపించిన కవితలను ఆసక్తిగా ఆలకించారు. కృష్ణమ్మ అలల పైన కదులుతున్న పడవలో కవి సమ్మేళనం జరగడం ఒక కొత్త ఒరవడికి నాంది అని మంత్రి దుర్గేష్ అభివర్ణించారు. అమరావతి ఒడిలో ప్రవహించే కృష్ణమ్మకు ఈ తరం కవులు సమర్పించిన కవితా హారతి ఇది అని ఆయన కొని యాడారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ పలు కీలక అంశాలను వెల్లడించారు. త్వరలోనే నంది నాటకోత్స వాలు నిర్వహించి, నంది అవార్డులను అందజేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో కుంటుపడిన సాంస్కృతిక రంగాన్ని గాడిలో పెడుతున్నామని, ఉగాది పురస్కారాలు, కందుకూరి పురస్కారాలను ఘనంగా అందజేస్తామన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మహాకవి తిక్కన విగ్రహ ఏర్పాటుపై ఇప్పటికే సీఎం చంద్రబాబుతో చర్చించామని, త్వర లోనే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇదే తరహా లో పెన్నా, గోదావరి నదీ తీరాల్లో సాహిత్య కార్యక్రమాలు చేపడతామని, ముఖ్యంగా దేవీ పట్నం నుండి పాపికొండలు వెళ్లే లాంచీలో త్వర లోనే కవి సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. సమకాలీన సమాజంలోని అట్టడుగు వర్గాల ఆవేదనను ప్రతిబింబించేలా సాగిన ఈ కవితలను వీడియో డాక్యుమెంటేషన్ ద్వారా డిజిటలైజ్ చేసి భావితరాలకు అందించనున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. కవులు, కళాకారుల ఆత్మగౌరవాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ విమర్శల మధ్య ఇలాంటి సాహిత్య వేదికలు తమకు మానసిక శాంతిని, సమాజ సేవకు పునరంకితమయ్యే స్ఫూర్తిని ఇస్తాయని మంత్రి దుర్గేష్(Minister Durgesh) చమత్కరించారు.


ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్షీశ మాట్లాడుతూ కవులు సమాజానికి వెలుగునిచ్చే భావభానులని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. రచయితలు, వారి రచనలను పరిరక్షించుకోవడం సమాజ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కళలు, సాహిత్యం మన సంస్కృతికి జీవన రేఖలని, చెట్టు వేర్లు వంటివని.. ఇవి ఎంత బలంగా ఉంటే మన సమాజం అంత బలంగా ఉంటుందని పేర్కొ న్నారు. సృజనాత్మకతకు ప్రోత్సాహం అందించ డమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. స్థానిక పర్యాట కాన్ని, కాన్ని, సంస్కృతిని, కళలు, సంప్రదాయాలను ఎప్పుడూ కాపాడుకోవాలని ముఖ్యమంత్రి చెబుతుంటారని పేర్కొన్నారు. రచయితలు తమ రచనల ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేస్తారని, భావజాల వికాసంలో వారి పాత్ర అనిర్వచనీయమన్నారు. కవులు, రచయితలు, రచనలు లేని సమాజాన్ని ఊహించుకోలేమని.. తెలుగు సాహిత్యాన్ని మరింతగా ప్రోత్సహించే వారందరికీ ప్రభుత్వం చేయూతగా నిలుస్తుందని జాతీయ సాంస్కృతిక ఉత్సవాల స్ఫూర్తితో నేడు నిర్వహించిన కృష్ణాతీరం కవితా హారం కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన మల్లెతీగ సాహిత్య సేవా సంస్థకు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
ఏపీ సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్వి మాట్లాడుతూ ఒక జాతి బతకాలంటే భాష బతకాలి, సమాజం బతకాలంటే సాహిత్యం బతకాలి.. చరిత్ర అనేది రాజుల శాసనాల నుంచి కాదు.. కవుల పద్యాల నుంచి తెలుసుకున్న చరిత్రమనదని పేర్కొన్నారు.

నది భూమిని సస్యశ్యామలం చేస్తుంటే, కవులు మనుషుల మనసులను సస్యశ్యామలం చేస్తారని పేర్కొన్నారు. వేమన పద్యాలు, సుమతీ శతకం అందించే జ్ఞానం ప్రపంచమంతా తిరిగినా దొరకదని, సాహిత్యం అనేది తరతరాలకు విజ్ఞాన వారధి అని పేర్కొన్నారు. మనం ఎంత ఆధునికమైన ఏఐ యుగంలో జీవిస్తున్నప్పటికీ మూలాలను మరచిపోకూడదన్నారు. భాష-సాహిత్యాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తేజస్వి స్పష్టం చేశారు. మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ అధ్యక్షులు కలిమిశ్రీ.. మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు, ముఖ్యంగా సరికొత్తగా రూపాంతరం చెందిన, చెందుతున్న నేటితరం కవిత్వాన్ని కాలగర్భంలో కలిసి పోకుండా భద్రపరిచి, ముందుతరాలకు అందించేందుకు రికార్డు చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇంత గొప్ప కార్యక్రమానికి చేయూతనిచ్చిన రాష్ట్ర యంత్రాంగానికి ప్రభుత్వానికి, ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, వెస్ట్ తహసీల్దార్ రెబకా రాణిఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ముంబై నుంచి వచ్చిన 51 మంది కవులను మంత్రి దుర్గేష్ ఘనంగా సత్కరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

APTourismMinister CulturalPrograms Google News in Telugu Latest News in Telugu TeluguLiterature

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.