Minister Anitha: అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయతపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల వంటి జాతీయ పర్వదినాల్లో కనీసం జెండా కూడా ఎగురవేయకుండా, ప్యాలెస్‌కే పరిమితమై పబ్జీ ఆడుకునే వారికి దేశం పట్ల కనీస గౌరవం ఉండదని ఆమె ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తులకు కేవలం టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తే చాలు అనే ఆలోచనలు మాత్రమే వస్తాయని ఆమె మండిపడ్డారు.
Read Also: Bombay High Court Judgment: బిడ్డ గుర్తింపునకు తల్లి పేరే చాలు
టీమ్ ఇండియా విజయం – భారతీయుల ఆకాంక్ష
భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ జరిగినప్పుడు ప్రతి భారతీయుడు టీమ్ ఇండియా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారని, ఆ విజయంలో భాగస్వాములు కావాలని ఆశిస్తారని అనిత పేర్కొన్నారు. ప్రతీ భారతీయుడు దేశ విజయాన్ని కాంక్షిస్తుంటే, జగన్(Jagan) వంటి వారు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిరంతరం దేశాన్ని కించపరిచేలా వ్యవహరించే జగన్ వంటి వారికి దేశభక్తి గురించి ఎంత చెప్పినా అర్థం కాదని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: