📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Minister anitha: అమరావతిలో స్పోర్ట్స్ సిటీ

Author Icon By Saritha
Updated: October 14, 2025 • 12:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు: హోంమంత్రి అనిత

విజయవాడ : రాజధాని అమరావతిలో
అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తున్నట్లు హోంమంత్రి (Minister anitha) వంగలపూడి అనిత వెల్లడించారు. పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ లాంటి క్రీడా కార్యక్రమాలు పోలీస్ శాఖలోని క్రీడా సామర్ధ్యాన్ని, శిక్షణను, పరస్పర సహకారాన్ని ప్రతిబింబించేందుకు గొప్ప వేదికగా నిలుస్తాయన్నారు. రెండవ ఆల్ ఇండియా వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2025-26 పోటీలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం 6వ బెటాలియన్, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) స్పెషల్ పోలీస్ క్రీడా ప్రాంగణం. మంగళగిరిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర హోం మరియు వివత్తుల నిర్వహణశాఖ మంత్రి వంగలపూడి అనిత, విశిష్ట అతిథిగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు. ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు ఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సీపీవోల నుంచి వచ్చిన 32 టీమ్ లు మార్చ్ ఫాస్ట్ చేసి ముఖ్య అతిధులకు గౌరవ వందనం సమర్పించాయి.

Read also: తెలంగాణలో పెరుగుతున్న పండ్ల కొరత

అనంతరం హోం మంత్రి అనిత, డిజిపి హరీష్ కుమార్ గుప్తా పోటీలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ జాతీయస్థాయి క్రీడా సమ్మేళనంలో వెయిట్రిఫ్టింగ్, పవర్రిఫ్టింగ్, యోగా అంశాల్లో పురుషుల మరియు మహిళల విభాగాల్లో పోటీలు జరుగుతాయి. వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్ యూ) గుంటూరులోను, యోగా పోటీలు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) అమరావతిలో జరుగుతాయి. 32 జట్లకు చెందిన 1010 మంది క్రీడాకారులు ఈ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ లో పాల్గొంటున్నారు.ఈ పోటీలు సందర్భంగా హోం మంత్రి శ్రీమతి అనిత మాట్లాడుతూ. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి (Minister anitha) చంద్రబాబునాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం క్రీడలకు పెద్దపేట వేస్తుందన్నారు. అమరావతి కేంద్రంగా నిర్మిస్తున్న ” స్పోర్ట్స్ సిటీ”కి ఈ పోటీలు స్ఫూర్తిగా నిలిచి, భవిష్యత్తుల్లో నిర్వహించబోయే జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు వేదికగా నిలుస్తాయన్నారు. పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ లతో పాటు యోగాకు కూడా ఈ పోటీల్లో ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో సంతోషకరమన్నారు. ఇటీవల విశాఖలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 3,20,000 మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి గిన్నీస్ వరల్డ్ రికార్డు నెలకొల్పిందన్నారు. యోగ మన సంస్కృతిలో, దైనందిన జీవితంలో భాగమైందన్నారు. శారీరక దృఢత్వానికి మరియు మానసిక స్థైర్యానికి ప్రతీకలుగా నిలిచే వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ మరియు యోగా వంటి క్రీడలు పోలీసు శాఖలో స్ఫూర్తిని నింపే అంశాలన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Amaravati Development Amaravati News Amaravati sports city Andhra Pradesh Government Andhra Pradesh Sports Chandrababu Naidu Vangalapudi Anita

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.