📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Milk adulteration: పాల కల్తీని అడ్డుకోలేమా?

Author Icon By Sudha
Updated: January 29, 2026 • 4:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మానవుడికే కాదు పశుపక్ష్యాదుల ఆరోగ్యానికి సంకటంగా మారుతున్న కల్తీని నిరోధించేం దుకు పాలకులు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. దేశంలో రానురాను కల్తీ పెరిగి పోతున్నది. తాగేనీటిలో కల్తీ, ప్రాణాపాయం నుండి కాపాడే మందుల్లో కల్తీ, చివరకు పౌష్టికాహారంగా వయసుతో ప్రమేయం లేకుండా పసిపిల్లల నుండి వృద్ధుల వరకు సేవించే పాలల్లో కల్తీ (Milk adulteration), అదీఇది అని తేడా లేకుండా మొత్తం కల్తీమయంగా మారుతున్నది. అన్నింటి కంటే ముఖ్యంగా పాలల్లో కల్తీ (Milk adulteration) రానురాను ప్రమాదక రంగా మారుతున్నది. మనిషి మనుగడనే ప్రశ్నార్థకంగా చేసే సూచనలు కన్పిస్తున్నాయి. ఇంత ప్రమాదకరంగా మారుతున్నా, పొగమంచులా విస్తరిస్తున్నా, అడిగేవారు, అడ్డగించేవారు కరవైపోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే అవినీతికి, కల్తీకి అవినాభావ సంబంధం ఉంది. పెరుగు తున్న అవినీతికి రెట్టింపుస్థాయిలో కల్తీ జరుగుతున్నది. దీన్ని అరికట్టేందుకు చట్టాలున్నాయి. ఆ చట్టాలు అమలుచేసి కల్తీ జరగకుండా నిరోధించేందుకు కోట్లాది రూపా యలు వెచ్చిస్తున్నారు. కానీ కల్తీని ఏమాత్రం అరికట్టలేక పోతున్నారు. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కల్తీ మానవ జీవనానికి సవాలుగా మారుతున్నా, అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నదనే సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నా నిర్దిష్టమైన చర్యలవైపు అడుగులు వేయ లేకపోతున్నారు. ఇదేదో మూడోకంటికి తెలియకుండా జరగడం లేదు. బహిరంగ వ్యాపారమే. యూరియా లాంటి రసాయనిక ఎరువులు కలిపి పాలను అమ్ముతు న్నారు. స్వచ్ఛమైన పాల లభ్యత అనేది సమస్యగా మారిపోయింది. భారతదేశానికి సంబంధించి ఎన్నో సందర్భాల్లో సర్వోన్నత న్యాయస్థానం కల్పించుకున్న సందర్భాలున్నాయి. దేశ ప్రజలకు విక్రయించే పాలల్లో అధిక శాతం కల్తీయేనన్న వాస్తవాన్నిసాక్షాత్తు జాతీయ ఆహారభద్రత ప్రమాణాల మండలి ఏనాడో వెల్లడించింది. అప్పట్లో దేశంలో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తే అధిక శాతం శాంపిల్స్ లో కల్తీ బయటపడింది. సర్వోన్నత న్యాయస్థానం కల్పించుకొని ఇంతపెద్ద సమస్యపై పాలకులు ఏం చేస్తున్నారని నిలదీసింది. ఈ దురాగతాలను నివారించడంలో విఫలమవుతున్న అధికార గణంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ కేంద్ర, రాష్ట్రప్రభు త్వాలను సుప్రీం కోర్టు ప్రశ్నించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. యేడాది యేడాదికి పాల వినియోగం పెరుగు తుంటే ఉత్పత్తులు ఆ స్థాయిలో జరగడం లేదు. ప్రస్తుత లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు ముప్ఫైశాతం లోటు ఉన్నట్లు అధికార గణాంకాలే చెబుతున్నాయి. ఈ లోటు రాబోయే వేసవిలో మరింత పెరిగే అవకాశం ఉంది. హోటళ్లల్లో విక్రయించే పన్నీర్ బటర్ మసాలా వంటి వాటిల్లో సింథటిక్ పాలను అత్యధికంగా వాడుతు న్నట్లు బయటపడింది. బీహార్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో భారీ ఎత్తున కల్తీలు జరుగుతు న్నట్లు తనిఖీల్లో వెలుగుచూసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కల్తీ చేస్తున్న వ్యాపారులు ఎన్నోసార్లు పట్టుబడ్డారు. ఒక పాల వ్యాపారి ఇంటిపై దాడి చేసి యూరియా, డిటర్జెంట్ వంటి రసాయనికాలతో తయారు చేసినపాలను స్వాధీనం చేశారు. ఇకపోతే గ్రామాల నుంచి వచ్చే పాలు అమ్మకందారులు ఎక్కడపడితే అక్కడ, ఏ నీళ్లను అంటే ఆ నీళ్లను పాలల్లో కలుపుతున్నారు. ఫ్లోరైడ్, తదితర రసాయనాలు ఉన్న నీళ్లను కలపడంతో ప్రజారోగ్యంపై ఎంతటి ప్రభావం పడుతున్నదో గుర్తించడం లేదు. పాల ఉత్పత్తులను పెం చేందుకు ప్రవేశపెడుతున్న పథకాలు అంతగా సఫలీకృతం కావడం లేదు. భారీ ఎత్తున చిన్న కారు, సన్నకారు రైతులకు సమృద్ధిగా పాలు ఇచ్చే సంకరజాతి ఆవులను, గేదెలను కోట్లాది రూపాయలతో సరఫరా చేశారు. కానీ అందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించకపోవడంతో గిట్టుబాటుకాక దేశంలో అధికశాతం మంది అన్నదాతలు పాడిపశువులను అమ్ము కున్నారు. గ్రామాల నుంచి కాకుండా పట్టణాలు, నగరాల నుంచి గ్రామాలకు పాలపాకెట్లు సరఫరా అయ్యేదురదృష్ట పు రోజులు దాపురించాయి. ప్రభుత్వ ఆధీనంలో నడు స్తున్న డయిరీలు నష్టాలబాటలో మూసివే తకు దగ్గరలో ఉన్నాయి. ప్రభుత్వం వద్ద ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవడం, పాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితులను ఎదు ర్కోవల్సి వస్తోంది. మహాత్ముడు కూడా వ్యవసాయ అను బంధాల రాబడి పెంచితే తప్ప కోట్లాది గ్రామీణుల పేదల పరిస్థితి మెరుగుపడదని ఎన్నోసార్లు వకాణించారు. పాల ఉత్పత్తి అందుకు ఒక మార్గం. కానీ ఆ దారిలో పాలకులు అడుగులు వేయలేకపోతున్నారు. ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతున్నారు. మరెన్నో సబ్సిడీలు ఇస్తున్నా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. అన్నింటి కంటే భూముల విలువలు విపరీతంగా పెరిగిపోవడంతో పశువులను మేపు కునేందుకు బీడుభూములు కరవైపోయాయి. గడ్డికొని వేయాల్సి వస్తున్నది. అది రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఫలితంగా సన్నకారు, చిన్నకారు రైతుల్లో ఎక్కువ మంది పాడిపరిశ్రమకు మంగళం పాడుతున్నారు. ఇప్ప టికైనా పాలకులు క్షేత్రస్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థి తులను పరిగణనలోకి తీసుకొని అందుకు అనుగుణంగా పాల ఉత్పత్తులను పెంచేందుకు రైతులకు చేయూతనిస్తే తప్ప సమస్య తీరే అవకాశం లేదు. అలాగే కల్తీకి పాల్పడే వారిని చట్టంముందు నిలబెట్టి తిరుగులేని సాక్షాల తో రుజువుచేసి మళ్లీమళ్లీ కల్తీకి పాల్పడకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ఇందులో నిర్లక్ష్యం చేస్తే పాల ఉత్పత్తికి, వినియోగానికి వ్యత్యాసం పెరిగి అది పూడ్చేందుకు కల్తీ పాలు విస్తరించి ప్రజారోగ్యాన్ని కాటువేయక తప్పదు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Dairy safety Food adulteration Food Safety latest news Milk Adulteration public health Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.