📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest news: Mid Day Meal: నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు

Author Icon By Saritha
Updated: November 14, 2025 • 11:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

నెల్లూరు : ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అందించే ఆహార(Food) పదార్థాల(Mid Day Meal) నాణ్యత విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు బి.కాంతారావు అధికారులను హెచ్చరించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం నెల్లూరుకు విచ్చేసిన ఆహార కమిషన్ సభ్యులు కాంతారావు నగరంలోని పౌరసరఫరాల శాఖ స్టాక్ పాయింట్, ఇందిరా గాంధీ నగర్లోని రేషన్ షాపు, దర్గామిట్టలోని ట్రైబల్ వెల్ఫేర్ వసతి
గృహాన్ని అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఎంఎల్ఎస్ స్టాక్ 1/2 చక్కెర ప్యాకెట్లలో గ్రాముల్లో చక్కెర తక్కువగా ఉండడాన్ని గుర్తించారు. హమాలీలతో జీతాల విషయమై మాట్లాడారు. చక్కెర తక్కువగా ఉన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

Read also: గోడ కూలి ఇద్దరు కూలీల దుర్మరణం

ప్రభుత్వ హాస్టళ్లలో ఆహార నాణ్యత తనిఖీలు

ఇందిరా గాంధీ నగర్ లోని రేషన్ షాప్ను తనిఖీ(Mid Day Meal) చేసి ఈ పాస్ మిషన్లో సాంకేతిక లోపాలను గుర్తించారు. కార్డుదారులందరికి ప్రభుత్వ నిబంధనల మేరకు బియ్యం, చక్కెర అందించాలని సూచించారు. దర్గామిట్ట లోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ను తనిఖీ చేశారు. గడువు ముగిసిన సాల్ట్ ప్యాకెట్లను గుర్తించి హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాదారు. మరుగుదొడ్లకు తలుపులు లేవని, శుభ్రంగా లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఫుడ్ కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. కోడిగుడ్ల బరువు కూడా తక్కువగా ఉందని ఆయన గుర్తించారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాన ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు కాంతారావు మాట్లాడు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అందించే ఆహార విషయం అశ్రద్ధగా ఉన్నా.

ఆహార కమిషన్ హెచ్చరికలు & సూచనలు

నాణ్యతా ప్రమాణాలు పాటించకపోయినా ఊరుక ప్రసక్తి లేదని హెచ్చరించారు. రుచిగా, శుచిగా పోషక విలువలు ఆహారాన్ని అందించాలని సూచించారు. హాస్టల్స్కు సరఫరా అయే వస్తువులను ముందుగా సరిచూసుకోవాలని, నిర్దిష్ట ప్రమాణాల మేరకు తూకం, వస్తువు గడువు తేదీ పరిశీలించుకోవాలని సూచించారు. రేషన్ షాపుల్లో గుర్తించిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు చెర్య తీసుకుంటామని చెప్పారు. పౌర సరఫరాల విషయంలో ప్రజ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులందరూ సమర్ధవంత వనివేయాలని సూచించారు. తొలుత అర్అండ్ బి అతిథి గృహం అధికారులతో ఆహార కమిషన్ సభ్యులు సమావేశం నిర్వహించారు. కమిషన్ సభ్యులు వెంట డీఎస్ ఒలీలారాణి, డిఎం అర్జున్ రావు, లీవె మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి లక్ష్మమ్మ, ఫుడ్ సేఫ్టీ అధికారి నీరజ, ఐ సిడిఎస్ పిడి హేనాసు సమన్వయ అధికారి సైమన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

B Kantha Rao food quality inspection Government Hostels hostel inspections Latest News in Telugu ration shop issues student welfare Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.