📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Telugu News: Metro Expansion: హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర–రాష్ట్ర భాగస్వామ్యం

Author Icon By Pooja
Updated: November 19, 2025 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా నిధులు భరించే అవకాశముందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. నగరంలో అదనంగా 160 కిలోమీటర్ల మెట్రో మార్గాలు ప్రతిపాదించబడగా, ఈ లైన్ల ఆమోదంపై మార్చి నెలలోపే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

Read Also: TTD: కేసులోని వారందరికీ భద్రత కల్పించాలి: హైకోర్టు కీలక ఆదేశాలు

Center-State partnership for Hyderabad Metro expansion

హైదరాబాద్‌లో జరిగిన నైరుతి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పట్టణాభివృద్ధి శాఖల ప్రాంతీయ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, మెట్రో ప్రాజెక్టు దీనితో మరింత విస్తృతంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు.

ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం – కొత్త దశలో విస్తరణ

ఇప్పటి వరకూ మెట్రోను(Metro Expansion) ఎల్ అండ్ టీతో భాగస్వామ్యంలో నడిపిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా ప్రాజెక్టును స్వాధీనం చేసుకునే దిశగా సూత్రప్రాయ ఒప్పందం కుదుర్చుకున్న విషయం కూడా కేంద్రం దృష్టిలో ఉందని ఖట్టర్ గుర్తు చేశారు. తదుపరి దశలో మెట్రో విస్తరణకు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిధుల నిష్పత్తిలో ముందుకు వెళ్లే అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో నిర్మాణం(Metro Expansion) కోసం వచ్చిన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. అమరావతి నగర(Amaravati city) అభివృద్ధికి అవసరమైన నిధులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఖట్టర్ హామీ ఇచ్చారు.

పలురాష్ట్రాల పాల్గొనితో జరిగిన సమావేశం

ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, దాద్రానగర్ హవేలీ, దమన్-దీవ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం మంత్రి ఖట్టర్, తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హైదరాబాద్ మెట్రో విస్తరణపై మార్చిలోపు స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AmaravatiDevelopment Google News in Telugu HyderabadMetro Today news VisakhapatnamMetro

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.