విజయవాడ : మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి విజయ లక్ష్మీ(76) కన్నుమూసారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఎండీగా సుపరిచితులైన పీవీ కృష్ణారెడ్డి Megha Krishnareddy తల్లి విజయలక్ష్మి తన కుమారుని ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించారు. కృష్ణాజిల్లా పామర్రు పరిధిలోని డోకిపర్రుకు చెందిన విజయలక్ష్మి ఆధ్యాత్మిక, సామాజిక. విద్యా, వైద్య సేవా కార్యక్రమాల్లో కీలకంగా పాల్గొనే వారు. మేఘా ఆధ్వర్యంలో డోకిపర్రులో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించే విషయంలో ఆమె కృష్ణారెడ్డికి ప్రేరణగా నిలిచారు. ఈ ఆలయంలో ప్రతి ఏటా జరిగే కల్యాణోత్సవాలకు సీఎం చంద్రబాబు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవితో సహా ఎందరో ప్రముఖులు హజరయ్యారు.
TTD Tokens: పాతపద్ధతిలోనే అంగప్రదక్షిణ టోకెన్లు

Megha Krishnareddy
విజయలక్ష్మి కొంత కాలం నుంచి అనారోగ్యంగా ఉంటున్నట్లు సమాచారం. విజయలక్ష్మి మరణ వార్త తెలియడంతో డోకిపర్రులో విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి. ఆమె భౌతికకాయాన్ని పెద్ద సంఖ్యలో ప్రజలు సందర్శించి నివాళులర్పించారు. విజయలక్ష్మి అంత్యక్రియలు డొకిపర్రులోనే నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయలక్ష్మి మృతి పట్ల సీఎం చంద్రబాబుతో సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
మేఘా కృష్ణారెడ్డి తల్లి ఎవరు?
ఆమె పేరు విజయలక్ష్మి (వయసు 76).
ఆమె మృతి ఎప్పుడు సంభవించింది?
ఇటీవల అనారోగ్య కారణంగా మృత్యువాతపోయారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: