📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Medical mafia: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న మెడికల్ మాఫియా దారుణాలు

Author Icon By Anusha
Updated: July 28, 2025 • 11:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఓవైపు అక్రమ కిడ్నీ ఆపరేషన్లు, మరోవైపు అడ్డగోలుగా క్లినికల్ టెస్ట్లు, సరోగసి, ఐపిఎఫ్ పేరిట చైల్డ్ ట్రాఫికింగ్

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ సూఫియా ఆగడాలు సర్కారి విభాగాలను సవాల్ చేసే స్థాయికి వేరాయి. రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆక్రమ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లతో పాటు అడ్డా కూలీలపై కొత్త వాక్సిన్ల ప్రయోగం జరుగుతుండగా ఇదే సమయంలో ఆక్రమంగా లింగ నిర్దారణ పరీక్షలు, అక్రమ సరోగసీలు కొనసాగుతున్నాయి. తాజాగా ఐవిఎఫ్ పేరట చైల్డ్ ట్రాఫికింగ్ కూడా వెలుగు చూడడం సంచలనం రేపింది.శాస్త్ర, సాంకేతిక రంగంలో అనేక ఆవిష్కరణలకు నిలయంగా మారి సైన్స్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ (Hyderabad) వైద్య రంగంలో తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించే నగరంగా కూడా పేరుగాంచడం తెలిసిందే. ఇదే సమయంలో హైదరాబాద్లో పాటు ఎపిలోని ఇంకొన్ని పట్టణాల లోనూ వైద్య పరంగా సౌలభ్యాలు పెరగడం వుంచడం విదితమే.

తెలుగు రాష్ట్రాల పోలీసు విభాగాలను

ఇలా వైద్య పరంగా హైదరాబాద్లో పాటు విజయవాడ, వైజాగ్, గుంటూరు నగ రాలు ముందంజలో వుండగా దీనిని అందిపుచ్చుకుంటూ దేశ, విదేశాలలో మంచి పేరు, ప్రఖ్యాతులను అందుకుంటున్నాయి. అయితే ఇదంతా నాణానికి ఒకవైపుగా చెప్పాలి. ఇంకోవైపు మెడికల్ మాఫియా ఆగడాల గురించి ఎంతచెప్పినా తక్కువేననే విధంగా మారింది. ఇప్పటికే అక్రమ కిడ్నీ పరేషన్లు తెలుగు రాష్ట్రాల (Telugu states) పోలీసు విభాగాలను కుదిపేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లో ఆలకనంద ఆసుపత్రిలో వెలుగుచూసిన అశ్రడ కిడ్నీ ఆపరేషన్ల వ్యవహారం దేశ వ్యాప్తంగా సందలనం రేపింది. అనేక నగరాలకు చెందిన ప్రముఖ వైద్యులు ఈ స్కాంలో అరెస్టయ్యారు. ఆక్రమ కిడ్నీ ఆపరేషన్లకు ముందు వెలుగు చూసిన క్లినికల్ టెస్ట్లు మరీ దారుణంగా వుంటున్నాయి. కొన్ని ఔషధ కంపెనీలు కొత్త వాక్సిన్లను అడ్డా కూలీలపై ప్రయో గించడం, ఈ సందర్భంగా కొందరు మరణించడం.

పిల్లలు లేని దంపతులకు సరోగసి విధానం

పలుమార్లు వివాదాలకు తావిచ్చింది. ఈ సందర్భంగా పలు కంపెనీలపై కేసులు కూడా నమోద య్యాయి. దీని తరువాత అక్రమ లింగ నిర్ధారణ. లింగ నిర్ధారణను కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు నిషేధం విధించినా ఇది ఆగడం లేదు. దీని తరువాత సరోగసి స్కాం. పదేళ్ల నుంచి సరోగసి స్కాం కొనసాగుతోంది. పిల్లలు లేని దంపతులకు సరోగసి విధానం ద్వారా పిల్లలను అందించేందుకు ఉద్దేశించిన ఈ విధానం వైద్య పరంగా సాధించిన అభివృద్ధి. అయితే దీనిని సృష్టి సహా కొన్ని అసుపుత్రులు దుర్వినియోగం చేయడం వైద్య రంగానికి మాయనిమచ్చలా మారింది. సరోగసి కోసం బీడ, మధ్య తరగతికి చెందిన కొందరు మహిళలను కొందరు దళారులు మోసం చేస్తూ దండిగా సంపాదిస్తున్నారు. వీరికి కొన్ని అనుపత్రుల యాజమాన్యాలు సహకరిస్తున్నాయి. 2023లో వైజాగ్, హైదరాబాద్లోని సృష్టి ఆసుపత్రిలో ఈ గోల్ మాల్ గుట్టు రట్టయ్యింది.

తెలుగు రాష్ట్రాల్లో

అప్పట్లో వైజాగ్ సిటీలోని యూనివర్సల్ సృష్టి అనుపత్రి ఆక్రమంగా శిశువుల విక్రయాలకు పాల్పడడం తెలుగు రాష్టాల్లో సంచలనం రేపింది. ఇదే సృష్టి ఆసుపత్రి తాజాగా ఐవిఎఫ్ పేరిట వైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడడం పోలీసులను పాక్కు గురిచేసింది. సృష్టి ఆసుపత్రి సాగించిన అనైతిక విధానం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని బడా అనుపత్రుల్లో కొనసాగుతున్న అడ్డగోలు విధానాలను మరోసారి తెరపైకి తెచ్చింది. అప్పట్లో వైజాగ్ గర్భంతో వున్న ఓ వితంతువు ప్రసవించాక తనకు పుట్టిన మగ బిడ్డను ఆసుపత్రి యాజమాన్యానికి ఇచ్చేసి ఒంటరిగా ఇంటికి రావడంతో శిశు వు విషయమై ఆరా తీసిన కుటుంబ సభ్యులు అసలు విషయం తెలుసుకుని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సృష్టి ఆసుపత్రి గోల్మాల్ వ్యవహారాలు రట్టయ్యింది. తాజాగా ఇదే ఆసుప్యతిలో మరో దారుణం రట్టయ్యింది.

Medical mafia: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న మెడికల్ మాఫియా దారుణాలు

తమకు పిల్లలు లేకపోవడంతో ఈ దంపతులు

రెండేళ్ల క్రితం ఈ ఆసుపత్రి 56 శిశువులను దేశ వ్యాప్తంగా అనేక నగరాలలో పిల్లలులేని దంపతులకు అమ్మినట్లు తేలింది. హైదరాబాద్ సృష్టి ఆసుపతిలో అద్దె గర్భం కోసం పది లక్షల రూపాయలు చెల్లించి మోస పోయిన దంపతుల ఉదంతం వెలుగుచూసింది. పెళ్లయి చాలా కాలం అయినా తమకు పిల్లలు లేకపోవడంతో ఈ దంపతులు వైజాగ్ సిటీలో గల తమ ఆసుపత్రిలో మరో మహిళ ద్వారా అద్దె గర్భంతో పిల్లలను కనే సౌకర్యం కల్పిస్తామని నమ్మించి పది లక్షల రూపాయలు తీసుకుంది. ఇందులో భాగంగా వైజాగ్లోని ఓ వితంతువును ఆక్రమంగా సరోగసి ఊబీలో సృష్టి ఆసుపత్రి ఆమెకు మగ శిశువు పుట్టగానే శిశువును తీసుకుంది. అనంతరం ఆ మహిళకు కొంత నగదు ఇచ్చి ఇంటికి పంపింది.

ఈ వ్యవహారంపై

కాగా ఒప్పందంలో భాగంగా ఆ శిశువును సృష్టి ఆసుపత్రి యాజమాన్యం హైదరాబాద్ కు చెందిన దంపతులకు ఇవ్వాల్సి వుండగా అలా చేయకుండా అధిక డబ్బులకు ఆశపడి శిశువును కోల్కతా లోని వేరే దంపతులకు ఇచ్చింది. ఈ వ్యవహారంపై కూపీలాగిన వైజాగ్ సిటీ పోలీసులు కోల్కతా దంపతుల వద్ద వున్న శిశువును స్వాధీనం వేసుకుని, కన్నతల్లి ఒడికి చేర్చారు. ఇలా 56 శిశువులను ఈ ఆసుపత్రి అనేక మంది దంపతులకు అమ్మినట్లు కనుగొన్న పోలీసులు ఇందులో 40కి పైగా శిశువులను స్వాధీనం చేసుకుని హోంకు తరలించారు. ఈ మొత్తం వ్యవహారం రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

దీనికి సంబంధించిన

సృష్టి ఆసుపత్రికి ముందు 2017 జూన్లో తొలిసారిగా హైదరాబాద్ లోని సాయికిరణ్ అనే కార్పొరేట్ ఆసుపత్రిలో సరోగసి స్కాం వెలుగు చూడడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అప్పట్లో వెలుగు చూసిన స్కాంలో 48 మంది మహిళలు సరోగసి ద్వారా గర్భం దాల్చగా, 30 మంది మహిళలపై దీనికి సంబంధించిన ప్రయోగాలు జరిగినట్లు నిర్ధారణ అయ్యిం ది. ఇక తాజా విషయానికి వస్తే కొన్ని అసుపత్రుల్లో యువకుల మంచి వీర్య కణాలు, యువతుల నుంచి అండా లను అక్రమంగా సేకరిస్తూ వాటిని ఫ్రిజ్ నేస్తూ ఐపిఎఫ్ ద్వారా తమ వద్దకు పిల్లల కోసం వచ్చే దంపతులకు వాడుతున్నట్లు పోలీసులు తెచ్చారు. హైదరాబాద్లో వెలుగుమాసిన స్కాం ఈ తరహాలోనే వుండడం గమనార్హం.

మెడికల్ మాఫియా అంటే ఏమిటి?

తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణలో మెడికల్ మాఫియా అనేది ఇటీవల గణనీయంగా పెరిగిన సామాజిక సమస్యగా మారింది.

మెడికల్ మాఫియా దారుణాలు అంటే ఏమిటి?

విభిన్న టెస్టుల పేరుతో ప్రజలను మోసం చేయడం – అవసరం లేని స్కాన్‌లు, బ్లడ్ టెస్టులు చేయించడం.వైద్యులు మందుల కంపెనీలతో కుమ్మక్కై ఎక్కువ ఖరీదు చేసే మందులను రాయడం.ఆపరేషన్లు అవసరం లేకపోయినా అవసరమన్నట్టుగా చెప్పి బాధితులపై జరపడం.ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక బిల్లులు వసూలు చేయడం.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Srisailam Reservoir: శ్రీశైలం జలాశయం వద్ద పోటెత్తిన వరద ప్రవాహం

Breaking News Child trafficking gender determination Hyderabad medical scandals illegal kidney transplants IVF Scam latest news medical mafia Surrogacy Racket Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.