📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu news : Medical Colleges : దోచుకోవడానికే మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ : మాజీ మంత్రి ధర్మాన

Author Icon By Sudha
Updated: October 14, 2025 • 4:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కూటమి నేతలు ఇష్టానుసారంగా దోచుకోవడానికే ఆంధ్రప్రదేశ్‌లోని మెడికల్‌ కాలేజీల (Medical Colleges)ను ప్రైవేటీకరణకు పూనుకుంటుందని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. పేదలకు మంచి వైద్యం అందించడానికే వైఎస్‌ జగన్‌ 17 మెడికల్ కాలేజీలను (Medical Colleges)తీసుకొచ్చారని తెలిపారు.ప్రభుత్వ వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చామని, ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వ ఆస్పత్రులకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించామని స్పష్టం చేశారు. కరోనా విపత్తును ధైర్యంగా ఎదుర్కొన్నాం వివరించారు. కూటమి పాలనలో పేదలకు వైద్యం దూరమవుతుందని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం కాపాడటం ప్రభుత్వాల బాధ్యతని, మెరుగైన వైద్యం పొందటం ప్రజల ప్రాథమిక హక్కు అని గుర్తు చేశారు.

Medical Colleges : దోచుకోవడానికే మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ : మాజీ మంత్రి ధర్మాన

పేద, మద్య తరగతి కుటుంబాల్లో ఒకరికి ఆరోగ్యం పాడైనా అప్పుల పాలుకావల్సిందేనని అన్నారు. ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు పేదల కోసమేనని పేర్కొన్నారు . వైద్య రంగంలో వైఎస్‌ జగన్ చేసిన సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందేనని,పలాస కిడ్నీ ఆసుపత్రి, రిసెర్చ్‌ సెంటర్‌ ఇందుకు నిదర్శనమని అన్నారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే చంద్రబాబు ప్రభుత్వం మార్చుకోవాలని సూచించారు.

APలో ఎన్ని వైద్య కళాశాలలు ఉన్నాయి?

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 37 వైద్య కళాశాలలు ఉన్నాయి, వాటిలో 18 ప్రభుత్వ రంగంలో మరియు 19 ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ఈ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులను అందిస్తాయి మరియు డాక్టర్ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వంటి సంస్థలతో అనుబంధంగా ఉన్నాయి.

ఏ రాష్ట్రంలో వైద్య కళాశాల లేదు?

అతి తక్కువ వైద్య కళాశాలలు ఉన్న రాష్ట్రాలలో గోవా మరియు అన్ని ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. 27 ఫిబ్రవరి 2025 నాటికి, భారతదేశంలో 605 వైద్య కళాశాలలు మరియు 64 స్వతంత్ర పోస్ట్ గ్రాడ్యుయేట్ సంస్థలు ఉన్నాయి, వీటి అర్హతలను జాతీయ వైద్య కమిషన్ గుర్తించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Dharmana Prasada Rao Education Policy Ex Minister latest news medical colleges privatization Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.