📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Latest Telugu News : Poverty : పేదరిక నిర్మూలనకు ఏవీ చర్యలు?

Author Icon By Sudha
Updated: October 17, 2025 • 4:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దారిద్రం అనేది కేవలం తగినంత డబ్బు లేకపోవడాన్ని సూచించదు. ఇది ఆరోగ్య సంరక్షణ, విద్య, శుభ్రమైన నీరు, నిర్ణయాత్మక స్వేచ్చ వంటి ప్రాథమిక మానవ హక్కులు, అవకాశాలకు దూరంగా ఉండటాన్ని సూచిస్తుంది. ఆర్థిక వేత్త అమర్త్యసేన్ అభిప్రాయం ప్రకారం పేదరికం అనేది ‘సామర్థ్యాల కొరత’. ఇది సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలు తమ పూర్తి సామర్ధ్యాన్ని చేరుకోకుండా నిరోధించే ఒక సంక్లిష్టమైన సామాజిక ఆర్థిక రుగ్మత. దారిద్ర్యాన్ని స్థూలంగా నిరపేక్ష పేదరికం అంటే కనీస జీవనాధార అవసరాలు తీరనిస్థితి. సాపేక్ష పేదరికం అంటే సమాజం లోని సగటు స్థాయికంటే తక్కువ ఆదాయంగా వర్గీకరిం చవచ్చు. నేడు, ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు వంటి అంశాలను కొలిచే బహుముఖ పేదరిక (Poverty) సూచిక ద్వారా సమస్య లోతు ను సమగ్రంగా అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేదరిక నిర్మూలనకు కృషి జరుగుతున్నప్పటికీ, సుస్థిర అభి వృద్ధి లక్ష్యాలలో భాగంగా 2030నాటికి అత్యంత పేదరి కాన్ని నిర్మూలించాలనే లక్ష్యం కోవిడ్ 19 మహమ్మారి, అంత ర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల కారణంగా స
వాలుగా మారింది. ప్రపంచబ్యాంకు దారిద్య్ర్యరేఖను రోజుకు 2.15 డాలర్ల కొను గోలు శక్తికంటే తక్కువ ఆదాయంగా నిర్ణయించింది. ప్రపంచ నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 110 కోట్ల కు పైగా ప్రజలు నేటికీ ఆరోగ్య, విద్య, జీవన ప్రమాణాలకు సంబంధించిన బహుముఖ లోపాలను ఎదుర్కొంటున్నారు. మన దేశం గత దశాబ్దంలో పేదరిక నిర్మూలనలో అద్భుతమైన పురోగతిని సాధించింది. ప్రపంచ బ్యాంకు అంచనాల విశ్లేషణ ప్రకారం, 2011-12 నుండి 2022-23 మధ్య కాలంలో మనదేశంలో అత్యంత పేదరికం 27.1 శాతం నుండి 5.3 శాతానికి గణనీయంగా తగ్గింది.

Read Also: http://Prashanthi Reddy: జిఎస్టి 2.0తో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు

Poverty

ఈ చారిత్రక కాలంలో సుమారు 27కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికం నుండి బయటపడ్డారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పేదరికం (Poverty)తగ్గడం ప్రభుత్వ మౌలిక సదుపా యాలు, సంక్షేమ పథ కాల ప్రభావవంతమైన అమలును సూచిస్తుంది. నీతిఆయోగ్ జాతీయ బహుమితీయ పేదరిక సూచిక నివేదిక కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ విద్యుత్, వంట ఇంధనం, పారి శుధ్యం, గృహ వసతి వంటి అంశాలలో మెరుగుదల కారణంగా కోట్లాది మంది ప్రజలు పేదరికం నుండి బయట పడ్డారని స్పష్టం చేసింది. పేదరికం అనేది అనేక వ్యవస్థాపరమైన అంశాల కలయిక. దారిద్ర్యానికి ప్రధాన కారణాలలో ఒకటి సంపద, ఆదాయ అసమాన పంపిణీ. ఆర్థిక వృద్ధి జరుగుతు న్నప్పటికీ, దాని ఫలాలు సమాజం లోని సంపన్న వర్గాలకు మాత్రమే చేరడం వలన అసమానతలు పెరుగు తున్నాయి. ఈ అసమానతలు నిరుద్యోగం, ఉపాధి అవకాశాల కొరతతో మరింత తీవ్రమవుతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై అధికంగా ఆధారపడటం, పట్టణాల్లో అసంఘటిత రంగంలో తక్కువ వేతనాలు, సామాజిక భద్రత లేని ఉద్యోగాలు పేదరిక వలయాన్ని కొనసాగిస్తున్నాయి. అంతేకాకుండా నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ లేకపోవడం దారిద్ర్యానికి వ్యవస్థా పరమైన మూలాలుగా నిలుస్తాయి. నిరక్షరాస్యత, అసంపూర్ణ విద్య వలన శ్రామికులు అధిక వేతన ఉద్యోగాలు పొందలేరు. అదే సమయంలో, పేద కుటుంబాలు అనారోగ్యం పాలైనప్పుడు, చికిత్స కోసం అధికంగా అప్పు చేయవలసి వస్తుంది. ఇది వారిని మరింత అప్పుఊబిలోకి నెట్టివేస్తుంది. వీటితోపాటు, అధిక జనాభా పెరుగుదల, సామాజిక, లింగ వివక్ష, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అవినీతి, లీకేజీలు కూడా పేదరికాన్ని సుస్థిరంచేస్తాయి.

Poverty

పేదరిక నిర్మూలన ప్రక్రియలో అనేక నిర్మాణాత్మక సవాళ్లు ఎదుర వుతున్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనది పేదరిక వలయం’ను ఛేదించడం. ఈ వలయంలో, తక్కువ ఆదాయం, పేలవమైన ఆరోగ్యం, తక్కువ విద్య తరాల నుండి కొనసాగుతూ, కుటుంబం ఎప్పటికీ మెరుగుపడకుండా నిరోధించబడతాయి. రెండవ ప్రధాన సవాలు వాతావరణ మార్పుల ప్రభావం. అకాల వర్షాలు, కరువులు వంటి ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయాధారిత పేదవారి జీవనోపాధిని నాశనం చేసి, వారిని తిరిగి అత్యంత పేదరికంలోకి నెట్టేస్తాయి. మూడ వది, సాంకేతిక పరిజ్ఞాన వేగవంతమైన మార్పు వలన నైపుణ్యం లేని శ్రామికులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగు పరచుకోలేని పేదలు పోటీ ప్రపంచంలో వెనుకబడిపోతారు. నాలుగవ సవాలు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు పెరుగుతున్న వలసలు కారణంగా పట్టణ మురికివాడల్లో పేదరికం, వనరుల కొరత కేంద్రీకృతం కావడం. ఈ సవాళ్లు పేదరిక నిర్మూలనకు ఉద్దేశించిన ఏకపక్ష విధానాల అమలు ను సంక్లిష్టం చేస్తాయి. మొదటిగా ప్రతి పౌరుడికి నాణ్య మైన సార్వత్రిక విద్యఆరోగ్యం అందించడం అత్యవసరం. ఎందుకంటే ఇవి పేదరిక వలయాన్ని ఛేదించే అంశాలలో ప్రధానమైనది. రెండవది వ్యవసాయేతర రంగాలలో, ము ఖ్యంగా తయారీ, సేవారంగంలో ఉత్పాదక స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరి శ్రమలకు మద్దతుఇవ్వడం ద్వారా ఉద్యోగాలు సృష్టించవచ్చు. ఈలక్ష్యాల కోసం కేంద్రప్రభుత్వం అనేక విధానాలను అమ లు చేస్తోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేదలకు కనీసవేతన ఉపాధి హక్కును కల్పిస్తుంది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన స్వయం సహాయక బృందాలద్వారా ఆర్థికసహాయం అందించి గ్రామీణ పేదలకు స్థిరమైన జీవనోపాధిని సృష్టిస్తుంది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా ఆర్థికచేరికను సాధించి, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా పథకాల ప్రయోజనాలను లీకేజీలు లేకుండా నేరుగా బదిలీ చేయడం జరుగుతోంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల యోజన వంటి పథకాలు గృహవ సతి, శుభ్రమైన ఇంధనాన్ని అందించి బహుముఖ పేదరికాన్ని తగ్గించడంలో ముఖ్యపాత్ర వహిస్తు న్నాయి. పేదరికం అనేది కేవలం ఒక ఆర్థికసూచిక మాత్రమేకాదు. అన్యాయం, అసమానతలకు అద్దంపట్టే మానవీయ సంక్షోభం. భారతదేశం ఇటీవల సాధించిన పేదరిక తగ్గింపు విజయాలు, లక్షిత విధానాలు, సాంకేతికత ఆధారిత పాలన శక్తిని స్పష్టంగా నిరూపిస్తున్నాయి. ఈపురోగతిని నిలకడగా కొనసాగించడం, మిగిలిన పేదరికాన్ని నిర్మూలించడం, ముఖ్యంగా గ్రామీణ, పట్టణ అసమానతలను తగ్గించడం ద్వారానే మనదేశం నిజ మైన ఆర్థికసామాజిక న్యాయాన్ని సాధించి, అభివృద్ధి చెందిన దేశంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలుగుతుంది.
-డి. జయరాం

పేదరికానికి ప్రధాన కారణాలు ఏమిటి?

నిరుద్యోగం, అసమానత మరియు తక్కువ ఆర్థిక వృద్ధి వంటి ఆర్థిక అంశాలు పేదరికానికి ప్రధాన కారణాలు; వివక్షత, విద్య మరియు ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం వంటి సామాజిక సమస్యలు; మరియు సంఘర్షణ, అవినీతి మరియు ప్రకృతి వైపరీత్యాలు వంటి రాజకీయ మరియు పర్యావరణ సమస్యలు. పేలవమైన మౌలిక సదుపాయాలు మరియు అసమర్థ వనరుల వినియోగం వంటి వ్యవస్థాగత సమస్యలు కూడా ప్రజలను పేదరిక చక్రంలో చిక్కుకుంటాయి.

పేదరికాన్ని ఎలా ఆపాలి?

పేదరికాన్ని నిర్మూలించడానికి విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు ఉద్యోగ సృష్టి మరియు న్యాయమైన వేతనాలు వంటి ఆర్థిక అవకాశాలతో కూడిన బహుముఖ విధానం అవసరం. నాణ్యమైన విద్యను పొందడంలో మెరుగుదల, స్వచ్ఛమైన నీరు మరియు ఆరోగ్య సంరక్షణ వంటి ప్రాథమిక సేవలను అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం మరియు సమ్మిళిత ఆర్థిక విధానాలను అమలు చేయడం వంటి కీలక వ్యూహాలు ఉన్నాయి. సామాజిక రక్షణ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం, స్థిరమైన అభివృద్ధిని పెంపొందించడం మరియు శాంతియుత వాతావరణాన్ని నిర్ధారించడం కూడా దీర్ఘకాలిక పేదరిక తగ్గింపుకు దోహదం చేస్తాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Breaking News Economic Development Government Schemes latest news Poverty poverty eradication Social Welfare Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.