Markapuram Tippayapalem Road Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని తిప్పాయపాలెం వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైల మల్లన్నను దర్శించుకుని తిరిగి వెళ్తున్న భక్తుల జీపును, అరటికాయల లోడుతో వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Read Also: Addanki Crime: అనుమానంతో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య
నుజ్జునుజ్జు అయిన జీపు
ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. లారీ ఢీకొన్న వేగానికి భక్తులు ప్రయాణిస్తున్న జీపు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. మృతదేహాలు జీపులోనే ఇరుక్కుపోయాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Markapuram Tippayapalem Road Accident: శ్రీశైలం దర్శనం ముగించుకుని వస్తుండగా విషాదం
బాధిత భక్తులు కర్ణాటక నుండి శ్రీశైల క్షేత్రానికి వచ్చి, స్వామివారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల దర్యాప్తు
ఈ ఘటనపై మార్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: