📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telugu News: Margashira Masam: ‘ముహూర్తాలు’లేని మార్గశిరం!

Author Icon By Tejaswini Y
Updated: November 20, 2025 • 10:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మార్గశిర మాసం(Margashira Masam) గురువారం నుంచే ప్రారంభమైంది. పెళ్లిళ్లకు, గృహ ప్రవేశాలకు మార్గశిర మాసం మంచిదే. అయితే, ఈఏడాది నవంబరు 26 నుంచి శుక్ర మౌఢ్యమి ప్రారంభమైంది. అంటే, 17 వరకు ఈ శుక్ర మౌఢ్యమి ఉంటుందని జ్యోతిష్యులు, పంచాంగ కర్తలు చెబుతున్నారు. పంచాంగం పరిభాషలో చెప్పాలంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సర మార్గశిర శుద్ధ షష్టి నుంచి మాఘ బహుళ అమావాస్య వరకు ఈ శుక్ర మౌఢ్యమి ఉంటుంది. ఈ మౌఢ్యమినే వాడుక భాషలో మూఢమి అని అంటుంటారు. మూఢమి అంటే చీకటి అని అర్ధం. నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. నవగ్రహాల్లో గురుడు, శుక్రుడు తమ గమనంలో సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహాలు తమ కాంతిని కోల్పోవడం ద్వారా మూఢమి సంభవిస్తుంది.

Read Also:  Shubman Gill: రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ గైర్హాజరు

సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే

సూర్యుడికి, గురుడికి మధ్య 11 డిగ్రీలు, అలాగే, సూర్యుడికి శుక్రుడికి మధ్య 8 డిగ్రీల (వక్రదిశలో) దూరం, 10 డిగ్రీల (సవ్య దిశలో) దూరం గనక ఉంటే మౌఢ్యమివస్తుంది. గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం, శుక్రడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి. సూర్యునికి దగ్గరగా గురు, శుక్రులు వచ్చినప్పుడు, గురు, శుక్రుల శక్తులు తగ్గి బలహీన మైపోతాయి, నీరసపడతాయి, వాటిశక్తి సన్న గిల్లుతుంది. అంటే వేయివాట్స్ బల్బు ముందు క్యాండిల్ పెడితే, ఆ క్యాండిల్ శక్తి ఎంత మామూలుగా ఉంటుందో అలాగే సూర్యుడి దగ్గరగా చేరిన గ్రహాలస్థితి అంతే బలహీనంగా ఉంటుంది.

Margashira without ‘Muhurtas’!

గురు, శుక్ర గ్రహాల బలమే ప్రధానం

గురు, శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూధాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెబుతారు. ఎందుకంటే ఏ శుభకార్యానికి అయినా గురు, శుక్ర గ్రహాల బలమే ప్రధానం. ఈ రెండు గ్రహాలు(planets) బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలసిరాదన్నది పండితుల మాట. సౌర కుటుంబానికి పెద్ద సూర్యుడు. ఆయన శక్తి, కాంతి అనంతం. గురు, శుక్రుడు శుభగ్ర తెజస్సును కోల్పోవడమౌడుల్లి సమయంలో వాయిదా వేస్తుంటారు. దీంతో మూడంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకుండా పురాతన కాలం నుంచి పాటిస్తున్న ఆనవాయితీ.

గురుడు, శుక్రుడు అస్తంగత్వం (మౌఢ్యమి లేదా మూఢమి) చెందడమనేది భారతీయ జ్యోతిషం, ముహూర్త శాస్త్రంలో అత్యంత ముఖ్యమైన కాలం. ఈ సమయంలో శుభకార్యాల్ని నిలిపివేయడం అనాదిగా వస్తోన్న సంప్రదాయం. దీంతో ఈ మౌఢ్యమి కొనసాగనున్న 83 రోజులూ పెళ్లి చూపులు, వివాహం, ఉపనయనం, నూతన గృహారంభం, గృహ ప్రవేశం, వాహనంకొనడం, బోర్లు వేయడం, కేశఖండన (పుట్టు వెంట్రుకలుతీయించడం), చెవులు కుట్టిం చడం, వ్యాపారాలు ఆరంభించడం లాంటివి శుభకార్యాలునిర్వహించలేని పరిస్థితి. శుభ ముహూ ర్తాలకోసం మాఘ మాసం వరకు వేచి చూడాల్సిందే.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Auspicious Days Hindu Calendar Margashira Masam Margashira Masam 2025 Muhurthalu Lenivai Pooja Timings Telugu Astrology telugu panchangam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.