📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Maoist Operation : కూంబింగ్ టీమ్ అదుపులో మావోయిస్టు – ఎస్పీ అమిత్ బర్డర్

Author Icon By Shravan
Updated: August 18, 2025 • 9:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

303 తుపాకీ,9ఎంఎం పిస్తోల్, సామాగ్రి స్వాదీనం

పాడేరు Maoist Operation : అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం (G.Madugala Mandal) కిల్లంకోట పంచాయతీ, చింతగుప్ప పరిసర ప్రాంతాల్లో శనివారం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీస్బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించి నఘటన ప్రదేశం నుండి తప్పించుకొని కొంతమంది మావోయిస్టులు పారి పోయే ప్రయత్నించగా అందులో ఒక మావోయిస్టును అదుపులోకి తీసుకుని ఆ మావో యిస్టు వద్ద లభ్యమైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని అల్లూరి జిల్లా (Alluri District) ఎస్పీ అమిత్ బర్డర్ వెల్లడించారు. ఆదివారం జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్ వివరాలను వెల్లడించారు. అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ, చింతగుప్ప పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించి అక్కడ నుండి తప్పించుకొని పారి పోయే ప్రయత్నంలో బలగాలు చాకచక్యంగా ఒక మావోయిస్టును అదుపులోకి తీసుకోవడం జరిగిం దని ఎస్పీ తెలిపారు. పోలీస్ బలగాలు అదుపులోకి తీసుకున్న మావోయిస్టు ఒడిశా రాష్ట్రంకోరాపుట్ జిల్లా భాలియా పట్టు గ్రామానికి చెందిన చైతో (ఆలియాస్ నరేష్, సంతు) గుర్తించినట్టు ఎస్పీ తెలిపారు. మావోయిస్టు చైతో (ఆలియాస్ నరేష్, సంతు) 2011లో జననాట్య మండలి బృందంలో నరేష్ విప్లవాలకు ఆకర్షితుడై 15 సంవత్సరాలకే మావోయిస్టు పార్టీ సభ్యత్వం పొందాడన్నారు.

మావోయిస్టు దళంలో చేరి 2017లో కట్ ఆఫ్

బోయివరిగూడ మావోయిస్టు దళ కమెండర్గా బాధ్యతలు చేపట్టిన నరేష్ ప్రస్తుతం డిసిఎం మెంబర్ మరియు పెదబయలు కోరుకొండ ఏరియా కమిటీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి మావోయిస్టు కార్యకలాపాలు చేస్తున్నాడని మావోయిస్టు చైతో 8 ఎన్కౌంటర్లో పాల్గొన్నాడని ఎస్పీ పేర్కొన్నారు. అదుపులో తీసుకున్న మావోయిస్టు చైతో వద్ద 9 ఎమ్ఎమ్ పిస్టల్, 9 ఎమ్ఎమ్ లైవ్ అమ్మునిషన్ 023 కిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ అమిత్ బర్డర్తెలియజేసారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లా డుతూ మావోయిజం అనేది ఒక నిషేధిత సిద్ధాంతమని దానిని విడిచిపెట్టి మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఎస్పీ పిలుపు నిచ్చారు.

ఈ సమావేశంలో పాడేరు పోలీస్ ఇన్స్పెక్టర్ దీనబంధు పాల్గొన్నారు

స్వచ్ఛం దంగా లొంగిపోయిన మావోయిస్టులపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా ప్రభుత్వ పునరావాసం కల్పించడంజరుగుతుందని ఎస్పీ హామీ ఇచ్చారు. ఎవరైనా మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చిన వారికి సహాయ సహకారాలు అందించిన వారిపై సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ అమిత్ బర్డర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో పాడేరు పోలీస్ ఇన్స్పెక్టర్ దీనబంధు పాల్గొన్నారు. జి.మాడుల మండలం కిల్లంకోట పరిసరాల్లో మావోయిస్టుల కదలికలు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కూంబింగ్ వెళుతున్న పోలీస్ బలగాలపై మావోయిస్టులు కాల్పులకు ప్రయత్నించగా వాటిని చాకచక్యంగా బలగాలు అప్రమత్తం వ్యవహరించి ఒక మావోయిస్టును అదుపులోకి తీసుకోవడంతో పాటు తుపాకీలు స్వాదీనం చేసుకున్నారు.

ఈ ఘటనకు పాల్పడిన మావోయిస్టులు ఎంతమంది ఉన్నారో సమాచారం లేకపోయినా మళ్లీ మావోయిస్టులు కదలికలు ఈ ప్రాంతంలో కనిపిస్తుండటంతో పోలీస్ యంత్రాంగంలోనే కాకుండా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్ కదనం ప్రకారం అరెస్ట్ అయిన మావోయిస్టు చైతో కీళ్లంకోట ప్రాంతంలో ఛత్తీస్ గఢ్ నుంచి మావోయిస్టులు వచ్చే అవకాశాలు ఉన్న దృష్ట్యా క్నిల్లకోట ప్రాంతంలో స్థానిక గిరిజనుల సహకారంతో మావో యిస్టుల సమావేశం నిర్వహించడానికి ముందస్తుగా గిరిజనుల సహకారం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిసిందని ఎస్పీ తెలిపారు. దీంతో కిళ్లంకోట ప్రాంతాన్ని బలగాలు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇదిలా ఉండగా పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు సొంత గ్రామం కిల్లంకోట కావడంపై పోలీసులు మరింత అప్రమత్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/key-leaders-who-traveled-to-meet-with-trump/international/531715/

Breaking News in Telugu Combing Operation Telangana Latest News in Telugu Maoist Arrest News Maoist Latest News Security Forces Action Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.