📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Maoist Encounter: అల్లూరి జిల్లాలో భీకర ఎన్‌కౌంటర్: హిడ్మా హతం

Author Icon By Pooja
Updated: November 18, 2025 • 12:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల(Maoist Encounter) మధ్య తీవ్రంగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై స్పష్టమైన సమాచారాన్ని అందుకున్న పోలీసులు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సమయంలో మావోయిస్టులు అకస్మాత్తుగా ఎదురవడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి.

Read Also: FakeMessage Alert: SBI YONO బ్లాక్ అవుతుందంటూ నకిలీ మెసేజ్‌లు

Fierce encounter in Alluri district: Hidma killed

హిడ్మా మృతి నిర్ధారణ
దీర్ఘకాలం కొనసాగిన ఈ ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టులు(Maoist Encounter) మృతి చెందారు. వారిలో మావోయిస్టుల కేంద్ర కమిటీ కీలక నేత హిడ్మా కూడా ఉన్నారని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. భద్రతా బలగాలకు సుదీర్ఘకాలంగా సవాలుగా నిలిచిన హిడ్మాను ఈ ఎదురుకాల్పుల్లో పోలీసులు మట్టుబెట్టారు.

ఏపీ–తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఈ ఆపరేషన్‌లో హిడ్మాతో పాటు ఆయన భార్య సహా మరో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. హిడ్మాపై రూ. 1 కోటి, ఆయన భార్యపై రూ. 50 లక్షల రివార్డ్ ఉంది. వారం క్రితమే హిడ్మా తల్లిని ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి పరామర్శించిన విషయం తెలిసిందే. మాడ్వి హిడ్మి అసలు పేరు సంతోష్/హిడ్మన్న. 25 ఏళ్ల క్రితం అడవులకు వెళ్లిన అతను తిరిగి రావాలని అతని తల్లి పిలుపునిచ్చినప్పటికీ, తిరిగి రాలేదు.

ప్రస్తుతం సంఘటన స్థలంలో ఇంకా కాల్పుల అవకాశాన్ని పరిశీలిస్తూ భద్రతా బలగాలు భారీగా గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై అధికారులు అదనపు దృష్టి సారించారు.

హిడ్మా నేపథ్యం – 27 కేసులు
సుక్మా జిల్లా జేగురుగుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని పువర్తి హిడ్మా స్వగ్రామం. వయస్సు 55 ఏళ్లు. 10వ తరగతి వరకే చదివిన అతను హిందీ, కోయ భాషల్లో మాట్లాడగలడు. బాలల సంఘం నుంచి మావోయిస్టు పార్టీలో చేరి క్రమంగా ఎదిగి పీఎల్జీఏ ప్లాటూన్–1 కమాండర్‌గా, స్టేట్ మిలిటరీ కమాండర్‌గా పనిచేశాడు.
హిడ్మా ఆధ్వర్యంలో సుమారు 150 మంది కమాండర్లు పనిచేసేవారు. 5 కిలోమీటర్ల పరిధిలో మూడు చక్రాల దృఢమైన భద్రత వలయం ఉండేది. పువర్తి, జేగురుగుండా, తెర్రం, గుండం, కోవరగట్ట, కొండపల్లి గ్రామాల్లో అతనికి బలమైన నెట్‌వర్క్ ఉన్నట్లు గుర్తించారు.
మొత్తం 27 కేసుల్లో హిడ్మా నిందితుడిగా ఉన్నాడు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AlluriSeetharamaRaju Latest News in Telugu Maoists Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.