పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (Manohar)మరడాన శంకరరావు రైతుల కోసం చేస్తున్న సేవలు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. రైతులకు తనవంతు సాయం అందిస్తున్న శంకరరావుకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. కష్టకాలంలో రైతుల పక్కన నిలవడం ఎంతో ప్రశంసనీయమని మంత్రి పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూ, తన స్వగ్రామమైన కడకెల్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను 2019లో శంకరరావు గమనించారు. రైతు భరోసా కేంద్రాల్లో గోనె సంచులు అందకపోవడం, వాహనాల లభ్యత లేకపోవడం, కొనుగోళ్లలో జాప్యం వంటి సమస్యల కారణంగా రైతులు దళారుల వద్దకు వెళ్లి నష్టపోతున్నారని ఆయన గుర్తించారు. రైతుల ఇబ్బందులను చూసి సొంతంగా ముందుకొచ్చిన శంకరరావు, తన సొమ్ముతోనే రైతులకు గోనె సంచులు అందించడం ప్రారంభించారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు వాహనాలను కూడా ఏర్పాటు చేశారు.
Read Also: ఒకేరోజు నాలుగు కంపెనీలకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన..
మంత్రి మనోహర్ ప్రశంసలు
అవసరమైన(Manohar) రైతులకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని అప్పు సాయం అందించారు. ప్రభుత్వం నుంచి ధాన్యం చెల్లింపులు వచ్చాక రైతులు(Farmers) ఆ మొత్తాన్ని తిరిగి శంకరరావుకు చెల్లించే విధానం అమలులో ఉంది. ఈ విధంగా గ్రామ రైతుల పట్ల ఆయన చూపుతున్న ఆదరాభిమానాలు, సేవా భావం అందరి ప్రశంసలను అందుకుంది.రైతులకు చేస్తున్న ఈ సేవల గురించి తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్, శంకరరావును ప్రత్యేకంగా అభినందించారు. ఆయన పనితీరును ప్రశంసిస్తూ, ఇలా సామాజిక రంగానికి సేవ చేసే యువత మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు. మంత్రి అభినందనలకు శంకరరావు కృతజ్ఞతలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: