చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) పనులు మళ్లీ ఊపందుకున్నాయి. రాజధానిలో గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమవుతుండగా..ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా సమాచార సాంకేతిక (ఐటీ) రంగాన్ని అభివృద్ధి ఇంజిన్‌గా మలచుకోవాలనే వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అమరావతి పరిధిలోని మంగళగిరి ఐటీ కంపెనీలకు కీలక కేంద్రంగా వేగంగా ఎదుగుతోంది. మంగళగిరిలో ఐటీ సంస్థలు స్థిరపడే ప్రక్రియ గతంతో పోలిస్తే భారీగా వేగం పుంజుకుంది. ఇప్పటికే పలువురు బీపీఓలు, కేపీఓలు, ఫిన్‌టెక్, సాఫ్ట్‌వేర్ స్టార్టప్‌లు కార్యాలయాలను ప్రారంభించాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యేక ఐటీ ఎస్ఈజెడ్ (SEZ) వల్ల దేశీయ కంపెనీలతో పాటు అంతర్జాతీయ టెక్ సంస్థల ఆసక్తి కూడా పెరుగుతోంది. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ రంగాలకు సంబంధించిన సంస్థలు మంగళగిరిని తమ కార్యకలాపాల కేంద్రంగా ఎంచుకుంటున్నాయి.
Read Also: Noida: MRI ముందు ఇచ్చిన మత్తు మందుతో 6 ఏళ్ల బాలుడు మృతి
డేటా సెంటర్ల ఏర్పాటుపై కూడా ప్రభుత్వ దృష్టి
ఇటీవలి కాలంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. డేటా సెంటర్లు, టెక్ పార్క్‌లు ఏర్పాటు కావడం వల్ల వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఐటీ రంగం ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) పెరగడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక స్థిరత్వం రావడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషీన్ లెర్నింగ్, గ్రీన్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతలకు ప్రాధాన్యత ఇస్తూ పాలసీలను రూపొందిస్తోంది. ఐటీ కంపెనీల రాకతో సహజంగానే నివాస అవసరాలు భారీగా పెరుగుతున్నాయి. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఐటీ ఉద్యోగులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, మేనేజ్‌మెంట్ సిబ్బంది కోసం అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, అద్దె గృహాల డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు, కార్యాలయాల కోసం కమర్షియల్ స్పేస్, ఐటీ పార్కులు, కో-వర్కింగ్ హబ్‌ల అవసరం కూడా పెరుగుతోంది. ఈ పరిణామాలన్నీ మంగళగిరిలో రియల్ ఎస్టేట్ రంగానికి గణనీయమైన ఊపునిచ్చాయి. భారత్‌లో తొలి క్వాంటం వ్యాలీ.. రూ. 6 వేల కోట్లతో అమరావతిలో..ఇది ఎలా పనిచేస్తుందంటే.. అమరావతిని ఒక ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకుంది. సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఇప్పటికే రోడ్లు, డ్రైనేజ్, నీటి సరఫరా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మొత్తం ఏడు నగరాల కీలకంగా ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: