ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, మరెన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించినా, వెచ్చిస్తున్నా ప్రజలను పౌష్టికాహార లోపం నుండి గట్టెక్కిం చలేకపోతున్నారు. ఇప్పటికీ దేశంలో కోట్లాది మంది పౌష్టికాహార లోపంతో రకరకాల సమస్యలతో సతమత మవుతున్నారు. ప్రపంచ జనాభాలో పౌష్టికాహార లోపం తో బాధపడుతున్న బాలల్లో ఇరవై శాతం వరకు భారతా వనిలోనే ఉన్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక ఏనాటి నుంచో చెప్తున్నది. ప్రజలు ఏ మేరకు పౌష్టికవిలువలు ఉన్న ఆహారం తీసుకుంటున్నారనేది దేశ ఆర్థిక పరిస్థితికి సంకేతాలుగా నిలుస్తుందంటారు. భారత్లో గత మూడు దశాబ్దాల్లో ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆహార అలవాట్లు కూడా మారిపోయాయి. సాగు భూములు పెరగడంతోపాటు వ్యవసాయరంగంలో సాంకేతిక పరిజ్ఞానం చోటు చేసుకోవడంతో ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. అయినా ఇప్పటికీ దేశంలో పదిహేనుశాతం జనాభాకు ఆకలి బాధలు తప్పడం లేదని అనేక సర్వేలు వెల్లడి చేస్తున్నాయి. నూటపదిహేను దేశాల నుంచి సేకరించిన సమాచారంతో రూపొందించిన ప్రపంచ ఆకలి సూచి 2019లో భారత్ నూట రెండో స్థానం. దేశంలో ఇప్పటికే దాదాపు ఇరవై కోట్ల మందికి పైగా పౌష్టికాహార సమస్యలతో సతమతమవుతున్నారు. ఇందులో పదిహేను నుంచి నలభైఐదేళ్ల వయస్సు ఉన్న మహిళల్లో యాభై ఒక్కశాతం అత్యంత బలహీనంగా ఉం టున్నారని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఓ) నివేదిక స్పష్టం చేస్తున్నది. చాలా మంది రక్తహీనత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో దాదాపు డెబ్భై శాతం సరైన పౌష్టికాహారం లభించక (Malnutrition)రకరకాల సమస్య లతో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో దాదాపు నలభైశాతం మంది తక్కువ బరువుతో పుడు తున్నారని, వారిలో ఆరేడు శాతం మంది పిల్లలు పుట్టిన ఐదేళ్లలోపే మరణిస్తున్నారని ఎన్నో నివేదికలు వెల్లడిస్తు న్నాయి. ఈ భూమ్మీద పుట్టినవారికి ఎవరికైనా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాంటిది కనులైనా సరిగ్గా తెరవని పసిగుడ్డులకు సరైన ఆహారం అందక చనిపోతే దానికి బాధ్యత వహించాల్సింది పాలక పెద్దలే. తల్లీబిడ్డకు పౌష్టికాహారం అందివ్వకపోవడం కూడా పాల కుల బాధ్యతారాహిత్యం కిందకే వస్తుంది. అలాని పాల కులు ఏమీ చేయడం లేదని చెప్పడం లేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పౌష్టికాహార లోపాన్ని అధిగ మించేందుకు ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారు. లక్షల కోట్లు వెచ్చించారు. అయినా ఆశించిన ఫలితాలు లభించడం లేదు. ఇప్పుడు కొత్త చట్టాలు ప్రవేశపెట్టకపోతేపోయారు ఉన్న పథకాలను ఏమేరకు అమలు చేస్తున్నారో అర్హులైన వారిలో ఎంత మందికి అందిస్తున్నారో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. నిశితంగా పరిశీలించి, పరిశోధిస్తే ఈ పథకాలకు కేటా యించిన నిధులు అక్రమ మార్గాలకు ఎలా మళ్లిస్తున్నారో దర్యాప్తు జరిపితే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తాయి. పర్యవేక్షణ లోపం కారణంగా తల్లీబిడ్డకు అందా ల్సిన పౌష్టికాహారం పక్కదారి పడుతున్న విషయం ఎన్నో సార్లు వెలుగు చూసినా పటిష్టమైన చర్యలు లేకపోవడంతో నిరాటంకంగా కొనసాగుతున్నది. భారత్లోనేకాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా పౌష్టికాహారలోపం (Malnutrition) పెచ్చరిల్లిపో తుందనే చెప్పొచ్చు. భారత్లో పౌష్టికాహారం ప్రధానంగా సూక్ష్మపోషకాలఆహార సమస్య అధికంగా ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు పౌష్టికాహారాన్ని అందించేం దుకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు, స్వచ్ఛంద సేవాసంస్థలు, నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. 1975లోనే ఆరేళ్లలోపు పిల్లలకు, తల్లులకు పౌష్టికాహారం అందించేందుకు ఆనాటి కేంద్ర ప్రభుత్వం సమీకృత శిశు అభివృద్ధి పథకాన్ని ప్రవేశ పెట్టింది. ప్రధాన మంత్రి మాతృవందన యోజన, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఎన్నో కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. పౌష్టికాహార లక్ష్యంగా పని చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన అంగన్వాడీ కేంద్రాలు ఆ దిశగా అడుగులు వేయ లేకపోతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో సరఫరా అయ్యే సరుకుల్లో నాణ్యత లోపిస్తు న్నట్లు ఏనాటి నుంచో ఆరోపణలున్నాయి. అప్పుడప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినప్పుడు చర్యలు తీసుకుం టాం.
పునరావృతం కాకుండా చేస్తామంటూ చెప్తున్నారే తప్ప ఆచరణలో జరగడం లేదు. ఇంకొకపక్క పౌష్టికా హార లోపాన్ని అధిగమించేందుకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పోషకాలు కలిగిన బియ్యాన్ని అందించే కార్యక్ర మం కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మరింత చొరవ తీసుకొని సన్న బియ్యాన్ని ఈ పథకం ద్వారా అందిస్తున్నది. ఈపథకం పట్ల సన్నజనం ఎంతో సంతో షం వ్యక్తం చేస్తున్నది. గతంలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా వస్తున్న దొడ్డు బియ్యాన్ని తినలేక ఐదో, పది రూపాయలకు కిలో అమ్ముకునేవారు. అప్పుడు అది దళా రులకు ఒక కవచంగా మారిపోయి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. పథకాలు, ఉద్దేశ్యాలు అన్ని సక్రమంగా ఉన్నా సంతృప్తి కల్పించేవిధంగా కన్పిస్తున్నా ఆచరణకు వచ్చేసరికి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఈ పరిస్థి తుల్లో కొత్త పథకాల గురించి ఆలోచించకపోయినా ప్రస్తుతం ఉన్న పథకాలను సవరించి, పర్యవేక్షణను మరింత పటిష్టం చేస్తే కొంతవరకైనా లక్ష్యాన్ని చేరుకుంటాం. ప్రజలకు పౌష్టికాహారం లభించి ఆరోగ్యవంతమైన భారత్ వర్ధిల్లుతుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: