📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tangutur Fire Accident: టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

Author Icon By Anusha
Updated: March 1, 2026 • 10:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tangutur Fire Accident: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ పొగాకు గ్రేడింగ్ సంస్థ గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా (Godfrey Phillips India) కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగాకు గ్రేడింగ్ యూనిట్‌లో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే గిడ్డంగులకు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సమాచారం.

Read Also: Mohammad Pakpur Death News: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

కోట్ల విలువైన పొగాకు బూడిద.. అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది

కంపెనీలోని పొగాకు గ్రేడింగ్ యూనిట్‌లో మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే కంపెనీ యాజమాన్యం అగ్నిమాపక, పోలీస్ శాఖలకు తెలియజేసింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇతర గిడ్డంగులకు మంటలు వ్యాపించకుండా నిరోధించగలిగారు. 

Major fire accident in Tangutur

విద్యుత్ సరఫరాలో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 2,000కు పైగా పొగాకు బేళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దీంతో కంపెనీకి కోట్లలో నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Godfrey Phillips India Ltd Prakasam District Tobacco Company Fire Short Circuit Fire Prakasam Tangutur Fire Accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.