Mahesh Goud: పవన్‌ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి: టీపీసీసీ చీఫ్

Read Time:  1 min
Mahesh Goud: పవన్‌ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి: టీపీసీసీ చీఫ్
FONT SIZE
GET APP

టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ (Mahesh Goud) పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఒక ఆంధ్ర నాయకుడని, ఆయన తెలంగాణ వ్యతిరేకి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పవన్ తన రాజకీయాలను ఆంధ్రాలోనే చేసుకోవాలని, తెలంగాణలో ఆయన ప్రచారం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మహేశ్ గౌడ్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Read Also: Stray dogs: ప్రాణాల కంటే హక్కులే ముఖ్యమా?

Mahesh Goud: Pawan Kalyan should enter politics in Andhra: TPCC chief
Mahesh Goud: Pawan Kalyan should enter politics in Andhra: TPCC chief

గతంలో పవన్ తెలంగాణ గురించి చాలా నీచంగా మాట్లాడారు

“బీజేపీ నేతలు పవన్ కల్యాణ్‌ను భిక్షాం దేహీ అని అడిగారు” అని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో పవన్ తెలంగాణ గురించి చాలా నీచంగా మాట్లాడారని, అలాంటి వ్యక్తి మాటలు విని ఇక్కడి ప్రజలు ఓట్లు వేయరని అన్నారు. ఆయన మాటలను ఎవరూ విశ్వసించరని, ఆయన ప్రభావం తెలంగాణ రాజకీయాలపై శూన్యమని మహేష్ గౌడ్ (Mahesh Goud) స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.