📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Mahalodda Waterfalls: పర్యాటకులకు పండుగే.. మహాలొద్ద జలపాతం ప్రారంభం

Author Icon By Siva Prasad
Updated: February 4, 2026 • 11:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Mahalodda Waterfalls: ప్రకృతి ఒడిలో పరవళ్లు తొక్కే జలపాతాలకు నిలయమైన మన్యం జిల్లా పర్యాటక రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుందని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది అన్నారు. మహాలొద్ద జలపాతం ప్రారంభోత్సవంపై బుధవారం ఆయన పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే అత్యంత ఎత్తైన, ఆకర్షణీయమైన జలపాతాల్లో ఒకటిగా పేరుగాంచిన ‘మహాలొద్ద’ జలపాతాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గురువారం అధికారికంగా ప్రారంభిస్తారని అన్నారు. ట్రెక్కింగ్ చేసే సాహసికులకు, ప్రకృతి ప్రేమికులకు మరియు అడ్వెంచర్ పర్యాటకులకు ఈ జలపాతం సరికొత్త అనుభూతిని అందిస్తుందని అన్నారు.

Read Also: Disabled Posts : ఏపీలో మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ – మంత్రి వీరాంజనేయస్వామి

Mahalodda Waterfalls: సాహస యాత్రికులకు ఇది స్వర్గధామమని అన్నారు. స్థానిక గిరిజనుల ఆధ్వర్యంలో ‘కమ్యూనిటీ డ్రివెన్ టూరిజం’ పద్ధతిలో ఇక్కడ సౌకర్యాలు కల్పించడం జరిగిందని, దీనివల్ల స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నట్లు కలెక్టర్ వివరించారు. పర్యాటకుల సౌకర్యార్థం ఇక్కడ ఒక అధునాతన గెస్ట్ హౌస్ నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రారంభోత్సవం సందర్భంగా నందా గ్రామం నుంచి యువత భారీ బైక్ ర్యాలీతో జలపాతం వద్దకు చేరుకోనుందని, పర్యాటకుల కోసం స్థానికంగా జీపులను కూడా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని ఇతర జలపాతాలకు తలమానికంగా నిలిచే ఈ మహాలొద్ద జలపాతాన్ని పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు సందర్శించి ఆనందించాలని జిల్లా కలెక్టర్ అన్నారు .

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Adventure Tourism AP Tourism Dr N Prabhakara Reddy Gummidi Sandhyarani Mahalodda Waterfalls Manyam District Manyam News Tourist Places in Manyam Trekking Tribal Empowerment Waterfalls in Andhra Pradesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.