కాకినాడలో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లను నింపిన లారీ అదృశ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో దాదాపు రూ.28 లక్షల విలువైన నూనె చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. ఈ సంఘటన కాకినాడ (Kakinada) డెయిరీ ఫారమ్ సెంటర్‌కు చెందిన లారీ యజమాని దగ్గు అప్పారావుతో ముడిపడినట్లు తెలుస్తోంది.లారీ యజమాని దగ్గు అప్పారావు, ఒక ప్రైవేట్ ఆయిల్ కంపెనీ నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లను లోడ్ చేయించారు. ఈ లోడ్‌ను ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు తీసుకెళ్లాల్సి ఉండగా, లారీని పిఠాపురంలోని ప్రసిద్ధ కుంతీ మాధవస్వామి ఆలయం సమీపంలో పార్క్ చేశారు. అనంతరం, లారీ డ్రైవర్ నాళం రమణకు బాధ్యత అప్పగించి అప్పారావు అక్కడినుంచి వెళ్లిపోయారు.
ఘటన స్థలానికి చేరుకొని విచారణ
కానీ, బుధవారం ఉదయం లారీ తీసుకెళ్లేందుకు వచ్చిన డ్రైవర్ రమణకు ఎదురైన దృశ్యం షాకిచ్చింది. లారీ అక్కడ కనిపించకపోవడంతో తాను గుబులుపడ్డాడు. వెంటనే యజమాని అప్పారావు, స్థానిక పోలీసులకు విషయం తెలియజేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.లారీ చోరీపై ఆధారాలు సేకరించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీ (CCTV footage) ని పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా, మంగళవారం అర్ధరాత్రి 1:27 గంటల సమయంలో ఆ లారీ గొల్లప్రోలు టోల్‌ప్లాజాను దాటి వెళ్లినట్లు కనిపించింది. దీంతో పోలీసులు మరింత అప్రమత్తమై, లారీ గమ్యం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.ఈ విషయం తెలియగానే కాకినాడ పోలీసులు విశాఖపట్నం దిశగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు అలర్ట్ పంపించారు. రోడ్డుమీద టోల్‌ప్లాజాలు, ఇతర హైవే కెమెరాలకు సమాచారాన్ని పంపించారు.
పోలీసులు లారీని వదిలేసి వెళ్లిపోయిన ప్రాంతం
ఇంతలో తుని నేషనల్ హైవేపై లారీ ఉన్నట్లు పిఠాపురం పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు లారీ దగ్గరకు వెళ్లి చూస్తే, ఆయిల్ ప్యాకెట్లు దోచేసినట్లు గుర్తించారు. రోడ్డు పక్కన ఖాళీ లారీని వదిలేసి వెళ్లిపోయారు. లారీ యజమాని అప్పారావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు. లారీలో ఏకంగా రూ.28 లక్షల విలువైన నూనె ప్యాకెట్లు ఉన్నాయని చెబుతున్నారు. పోలీసులు లారీని వదిలేసి వెళ్లిపోయిన ప్రాంతం నుంచి సీసీ ఫుటేజ్ పరిశీలించే పనిలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏపీలో గతంలో కొన్ని ముఠాలు హైవేలపై చోరీలు చేసిన ఘటనలు ఉన్నాయి. దోపిడీ ముఠానే ఇలా లారీని ఎత్తుకెళ్లి ఆయిల్ ప్యాకెట్లను ఎత్తుకెళ్లిందనే అనుమానాలు మొదలయ్యాయి. ఇటీవల నెల్లూరు జిల్లాలో కూడా ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లడం కలకలం రేపింది.
ప్రస్తుతం కాకినాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు?
ప్రస్తుతం కాకినాడ నియోజకవర్గానికి వనమాడి వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు.
వారు 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, తెలుగు దేశం పార్టీ (TDP) తరఫున విజేతగా నిలిచారు.
కాకినాడలో ప్రసిద్ధమైన ఆహార పదార్థం ఏమిటి?
కాకినాడ కాజా కాకినాడలో అత్యంత ప్రసిద్ధి చెందిన మిఠాయి. ఇది మైదా, పంచదార నెయ్యితో తయారవుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: