Lok Sabha: ఇండియా – పోలండ్ పార్లమెంటరీ గ్రూప్ లో ఎంపి ఏలూరు పి మహేష్

Read Time:  1 min
Lok Sabha
Lok Sabha
FONT SIZE
GET APP

64 దేశాలకు పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ బృందాలు ప్రకటించిన లోక్ సభ స్పీకర్

సోమవారం 64 దేశాలకు పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ బృందాలను ప్రకటించారు. ఇతర దేశాల పార్లమెంట్ సభ్యులతో మెరుగైన సంబంధాలు ఏర్పరచుకోవడమే ఈ నిర్ణయ లక్ష్యం. ఇందులో భాగంగా ఇండియా–పోలాండ్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యునిగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ను (Putta Mahesh Kumar) ఎంపిక చేశారు. ఈ బృందాలు ప్రపంచ దేశాలతో శాంతి, సామరస్యం, సహకారాన్ని పెంపొందించేందుకు పనిచేస్తాయి. ఎంపీలు నామినేట్ చేసిన దేశాల చట్టసభ సభ్యులతో నేరుగా సంభాషణలు జరుపుతారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి పర్యటనలు కూడా నిర్వహిస్తారు.

Read also: Census 2027 India: జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల

Lok Sabha

Eluru MP P Mahesh in India-Poland Parliamentary Group

ప్రధాని నరేంద్ర మోడీ సూచనలతో ఈ కమిటీలను ప్రకటించారు

గతంలో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై చేపట్టిన చర్యల తర్వాత భారత వైఖరిని ప్రపంచానికి తెలియజేయడానికి 33 దేశాలకు ఏడు పార్లమెంటరీ బృందాలను పంపారు. రాజకీయ భేదాలకు అతీతంగా భారతదేశం యొక్క ఉగ్రవాద వ్యతిరేక దృక్పథాన్ని ఈ ప్రతినిధులు వివరించారు. ఈ చర్యకు మంచి స్పందన లభించింది. అదే అనుభవంతో 18వ లోక్సభ కాలానికి పూర్తి స్థాయి ఫ్రెండ్షిప్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సూచనలతో ఈ కమిటీలను ప్రకటించారు. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రయోజనాలను బలోపేతం చేయడమే ప్రధాన ఉద్దేశ్యం.

ఇండియా–పోలాండ్ గ్రూప్‌లో పుట్టా మహేష్ కుమార్‌కు అవకాశం లభించగా, క్యూబా బృందానికి మాగుంట శ్రీనివాసులురెడ్డి నాయకత్వం వహిస్తారు. మాల్దీవుల బృందానికి లావు కృష్ణ దేవరాయలు నాయకత్వం అందిస్తారు. గత నవంబర్‌లో నార్వే పర్యటనలో కూడా పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. అక్కడ నార్వే పార్లమెంట్‌తో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలను సందర్శించారు. లింగ సమానత్వం, మహిళా సాధికారత అంశాలపై అధ్యయనం చేశారు. ఈ అనుభవం ఆయనకు అంతర్జాతీయ సంబంధాల విషయంలో మరింత అవగాహన కల్పించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.