📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : Logistics -లాజిస్టిక్స్ గేట్‌వేగా ఏపీ సత్వర అభివృద్ధి – సీఎం చంద్రబాబు

Author Icon By Shravan
Updated: September 3, 2025 • 10:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నం Logistics : తూర్పు తీర మారిటైమ్ లాజిస్టిక్స్ గేట్ వేగా ఏపీ మారుతుందని
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) స్పష్టం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణా, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, కర్ణాటక తదితర రాష్ట్రాల హింటర్ ల్యాండ్ కార్గోను కూడా ఏపీ పోర్టుల ద్వారా రవాణా చేసేలా కార్యాచరణ చేపడుతున్నామని వివరించారు. మంగళవారం విశాఖలో జీఎఫ్ఎస్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీని లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ చేపడుతున్నామని సీఎం స్పష్టం చేశారు. ఈస్ట్ కోస్టు గేట్ వేగా ఏపీ అత్యుత్తమ ప్రదేశమని అన్నారు. సదస్సు కంటే ముందు మారిటైమ్ లాజిస్టిక్స్ అభివృద్ధిపై దేశవ్యాప్తంగా వివిధ పోర్టులు, కార్గో హ్యాండ్లింగ్ కంపెనీలకు చెందిన 62 మంది సెఈఓలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో మారిటైమ్ లాజిస్టిక్స్ రంగంలో ఉన్న అవకాశాలు, పోర్టు కార్గో హ్యాండ్లిగ్ లో మోలిక సదుపాయాల కల్పన, రోడ్డు, రైలు కనెక్టివిటి, డరేవుల్లో టెర్మినళ్ల ఆధునీకరణ, షిప్ బిల్డింగ్, మారిటైమ్ లాజిస్టిక్స్ లో అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ప్రమాణాలతో పాటు వివిధ అంశాలను ప్రతిపాదించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పోర్టుల ద్వారా 69 మిలియన్ టన్నుల మేర ఇనుప ఖనిజం, 11 మిలియన్ టన్నుల బొగ్గు, 5.5 మిలియన్ టన్నుల ఎరువుల రవాణా జరుగుతోందని సీఎం తెలిపారు. బల్క్ కార్గో రవాణాకు భారీ నౌకలు రాకపోకలు సాగించేలా 18 మీటర్ల లోతైన ఓడరేవులు తూర్పుతీరంలో ఏపీ మినహా మరెక్కడా లేవన్నారు. సముద్ర రవాణా పరంగా ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు.

ఏపీ పోర్టులకు సమగ్ర కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ రూపకల్పన!

పోర్టులకు అనుసంధానంగా మూడు పారిశ్రామిక కారిడార్లు కూడా ఏపీలో ఉన్నాయని తెలిపారు. పొరుగు రాష్ట్రం తెలంగాణా డ్రైపోర్టును ఏర్పాటు చేసి మచిలీపట్నం ద్వారా కార్గో రవాణా చేయాలని భావిస్తోందని అన్నారు. గోదావరి నది (Godavari River) ద్వారా అంతర్గత జలరవాణా మార్గాలతో మహారాష్ట్ర, కర్ణాటక కూడా ఏపీలోని కొన్ని పోర్టుల ద్వారా సరకు రవాణా చేయాలని భావిస్తున్నట్టు సీఎం స్పష్టం చేశారు. ఇవన్నీ ఏపీకి ఉన్న సానుకూలతలని తెలిపారు. ప్రతీ పోర్టుకు కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు, రైలు మార్గాలను అనుసంధానించి ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ వ్యవస్థను రూపొందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వీటితో పాటు అంతర్గత జలరవాణా మార్గాలను కూడా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. గోదావరి, కృష్ణా నదుల ప్రవాహ మార్గాల్లో దాదాపు 1500 కిలోమీటర్ల మేర జల రవాణా మార్గాలను వినియోగించుకునేందుకు అవకాశం ఉందన్నారు. కాకినాడచెన్నైల మధ్య పురాతనమైన బకింగ్ హామ్ కెనాల్ రవాణా మార్గాన్ని పునరుద్ధరిస్తామని సీఎం తెలిపారు. ఈ రవాణా మార్గాలను అనుసంధానించటం ద్వారా అతి తక్కువరవాణావ్యయం సాధించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆపరేషనల్ గా ఉన్న పోర్టులు, కొత్తగా అందుబాటులోకి రానున్న పోర్టులతో రహదారులు, రైలు మార్గాలు, అంతర్గత జలరవాణా, ఎయిర్ కార్గో మార్గాలను అనుసంధానించేలా ప్రతీ పోర్టుకూ కనెక్టివిటి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని సీఎం వెల్లడించారు.

ఏపీలో లాజిస్టిక్స్ కార్పోరేషన్, యూనివర్సిటీలు త్వరలో!

రవాణా పరమైన అంశాలను నిర్వహించేందుకు వీలుగా ఏపీలో త్వరలోనే లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తక్కువ వ్యయంతోనే రైలు, రోడ్డు మార్గాలను పోర్టులకు అనుసంధానించే అవకాశం ఉందని తెలిపారు. పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవపోర్టులకు అనుసంధానంగా పారిశ్రామిక కార్యకలాపాలతో పాటు టౌన్ షిప్ లను కూడా ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపోందిస్తున్నామని సీఎం వివరించారు. మూలపేట, మచిలీపట్నం, కాకినాడ, రామాయపట్నం ఇలా వివిధ పోర్టుల వద్ద పరిశ్రమల ఏర్పాటు, టౌన్ షిప్ ల కోసం 10 వేల ఎకరాల భూమి కూడా అందుబాటులో ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థతో పాటు ఈ రంగాల్లో నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యేలా లాజిస్టిక్స్ యూనివర్సిటీ, సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీలు కూడా త్వరలో ఏర్పాటు అవుతాయని సీఎం తెలిపారు. విశాఖ, అమరావతి, తిరుపతి సహా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఎయిర్ కార్గో రవాణాకు కూడా అనువుగా ఏర్పాట్లు చేస్తామన్నారు.

Logistics -లాజిస్టిక్స్ గేట్‌వేగా ఏపీ సత్వర అభివృద్ధి – సీఎం చంద్రబాబు

ఏపీలో మారిటైమ్ లాజిస్టిక్స్‌కు నూతన పరిశ్రమల ప్రోత్సాహం!

మొత్తంగా జీఎస్టీపీలో లాజిస్టిక్స్ రంగం 3 శాతానికి పెంచుకునేందుకు అవకాశం ఉందన్నారు. దుగరాజపట్నం సహా వివిధ ప్రాంతాల్లో షిప్ బిల్డింగ్ యూనిట్లు, మరమ్మత్తులు, కంటైనర్లు, షిప్ రీసైక్లింగ్ లాంటి పరిశ్రమల ఏర్పాటుకు అవకాశముందని సీఎం స్పష్టం చేశారు. మారిటైమ్ లాజిస్టిక్స్ కు సంబంధించి 1520 మంది పారిశ్రామిక వేత్తలతో కూడిన సలహా బోర్డును కూడా ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతకు ముందు మారిటైమ్ రంగంలోని ఆరు స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. ఎయిర్ కార్గో ఫోరం ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, డీబీవీ స్వామి, మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, ఆ సంస్థ అధికారులు, జీఎఫ్ఎస్టీ వైస్ చైర్మన్ ఎస్.పి.టక్కర్ తదితరులు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ను తూర్పు తీర మారిటైమ్ లాజిస్టిక్స్ హబ్‌గా ఎందుకు అభివృద్ధి చేస్తున్నారు?
లోతైన పోర్టులు, రోడ్డు-రైలు కనెక్టివిటీ, పొరుగు రాష్ట్రాల కార్గో రవాణా సౌకర్యం వంటి అనుకూలతలతో ఏపీని తూర్పు తీర లాజిస్టిక్స్ గేట్‌వేగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు పెంచి రవాణా వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యం.

ఏపీలో మారిటైమ్ లాజిస్టిక్స్ అభివృద్ధికి ఏ ప్రాజెక్టులు ఉన్నాయి?
పోర్టుల ఆధునీకరణ, 1500 కి.మీ జలరవాణా మార్గాలు, బకింగ్‌హామ్ కాలువ పునరుద్ధరణ, పరిశ్రమల క్లస్టర్లు, లాజిస్టిక్స్ యూనివర్సిటీలు, షిప్‌బిల్డింగ్ యూనిట్లు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తాయి.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/us-federal-court-shocks-trump-government/international/540450/

Andhra Pradesh logistics ap cm chandrababu AP economy growth AP infrastructure development Breaking News in Telugu Latest News in Telugu logistics hub India Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.