Loan app: లోన్ యాప్ వేధింపులకు బలైన మరో యువకుడు

Read Time:  1 min
Loan app: లోన్ యాప్ వేధింపులకు బలైన మరో యువకుడు
FONT SIZE
GET APP

తెలుగు రాష్ట్రాలలో మొబైల్ లోన్ యాప్ నిర్వాహకుల యొక్క అనుచిత మరియు దుర్మార్గపు ఆగడాలు భయానకంగా పెరిగిపోతున్నాయి. గత కొంతకాలంగా, అత్యవసరంలో డబ్బు తీసుకున్న పాపానికి ఆత్మహత్య చేసుకునే దాకా వేధింపులకు గురిచేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఏపీలో మరో యువకుడు ఈ లోన్ యాప్ భూతానికి బలయ్యాడు. గంటగంటకూ ఫోన్ చేసి డబ్బులు కట్టాలంటూ వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక పురుగులమందు తాగి చనిపోయాడు.

శ్రీకాంత్ మృతిచెందిన ఘటన

తాజాగా, అన్నమయ్య జిల్లా కురిపులూరు మండలం శ్రీకాంత్ అనే యువకుడు ఈ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు బలయ్యాడు. శ్రీకాంత్ కొంతకాలం క్రితం లోన్ యాప్ ద్వారా చిన్న రుణం తీసుకున్నాడు. అతను వాయిదాలు సక్రమంగా చెల్లిస్తున్నప్పటికీ, ఒక వాయిదా చెల్లించడంలో ఆలస్యం కావడం వలన, యాప్ నిర్వాహకులు శ్రీకాంత్‌ను తీవ్రంగా వేధించడం ప్రారంభించారు. గంటగంటకూ ఫోన్ చేసి డబ్బులు కట్టాలంటూ వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక పురుగులమందు తాగి చనిపోయాడు. అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శ్రీకాంత్ తల్లిదండ్రులు ఈ ఘటనపై తీవ్రంగా ఆవేదన చెందారు. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి, తమ కుమారుడి ఆత్మహత్యకు కారణమైన లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు లోన్ యాప్ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు లోన్ యాప్ వేధింపులకు గురవుతున్న వారు తమను సంప్రదించాలని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.

Read also: Andhrapradesh: ఈ నెలలోనే ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం అమలు

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.