📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: liquor scam: మద్యం కేసులో సుప్రీమ్ కోర్ట్ కీలక ఆదేశాలు

Author Icon By Tejaswini Y
Updated: November 26, 2025 • 4:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ కాలంలో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న మద్యం(liquor scam) అక్రమాలు కేసులో ఇవాళ మరో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు ప్రధాన నిందితులకు విజయవాడ(vijayawada) ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ ప్రభుత్వం హైకోర్టు ఆశ్రయించగా, హైకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. అంతేకాక, నిందితులు సిట్‌ ముందు హాజరవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయం వెలువడింది.

Read Also: Nara Lokesh: అమ్మాయిలను కించపరిచేలా మాట్లాడితే కఠిన చర్యలు

Supreme Court’s key orders in liquor case

కౌంటర్ పిటిషన్ దాఖలు

వైసీపీ పాలన సమయంలో జరిగినట్లు ఆరోపిస్తున్న మద్యం కుంభకోణంపై సీఐడీ(Criminal Investigation Department) సిట్ దర్యాప్తు కొనసాగిస్తున్నది. ఈ క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను అరెస్టు చేసింది. మద్యం ఉత్పత్తి సంస్థల ద్వారా వచ్చిన అక్రమ ఫండ్స్‌ను ఉన్నత వైసీపీ నాయకులకు చేరవేశారన్న ఆరోపణలపై వీరిపై చర్యలు తీసుకున్నారు. రిమాండ్ అనంతరం దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు(ACB Court) అంగీకరించడంతో ముగ్గురూ విడుదలయ్యారు.

తాజాగా, నిందితులు సిట్‌కు లొంగిపోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో సిట్ 10 రోజుల్లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. అలాగే నిందితుల తరఫు న్యాయవాదులు రిజాయిండర్ దాఖలు చేసేందుకు అదనంగా 5 రోజులు సమయం కోరారు. దీనితో కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్ 15కు వాయిదా వేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh politics AP liquor scam Balaji Govindappa CID SIT Dhanunjay Reddy Krishnamohan Reddy Supreme Court YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.