ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ కాలంలో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న మద్యం(liquor scam) అక్రమాలు కేసులో ఇవాళ మరో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు ప్రధాన నిందితులకు విజయవాడ(vijayawada) ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ ప్రభుత్వం హైకోర్టు ఆశ్రయించగా, హైకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. అంతేకాక, నిందితులు సిట్ ముందు హాజరవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయం వెలువడింది.
Read Also: Nara Lokesh: అమ్మాయిలను కించపరిచేలా మాట్లాడితే కఠిన చర్యలు

కౌంటర్ పిటిషన్ దాఖలు
వైసీపీ పాలన సమయంలో జరిగినట్లు ఆరోపిస్తున్న మద్యం కుంభకోణంపై సీఐడీ(Criminal Investigation Department) సిట్ దర్యాప్తు కొనసాగిస్తున్నది. ఈ క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను అరెస్టు చేసింది. మద్యం ఉత్పత్తి సంస్థల ద్వారా వచ్చిన అక్రమ ఫండ్స్‌ను ఉన్నత వైసీపీ నాయకులకు చేరవేశారన్న ఆరోపణలపై వీరిపై చర్యలు తీసుకున్నారు. రిమాండ్ అనంతరం దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు(ACB Court) అంగీకరించడంతో ముగ్గురూ విడుదలయ్యారు.
తాజాగా, నిందితులు సిట్‌కు లొంగిపోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో సిట్ 10 రోజుల్లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. అలాగే నిందితుల తరఫు న్యాయవాదులు రిజాయిండర్ దాఖలు చేసేందుకు అదనంగా 5 రోజులు సమయం కోరారు. దీనితో కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్ 15కు వాయిదా వేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: